పార్టీ సాంగ్ : రూ. 6 కోట్లు వసూలు చేస్తున్న సోనాక్షి?
ఇదొక నైట్ పార్టీ సాంగ్ అని, ఇందులో సోనాక్షి హాట్ అండ్ సెక్సీ లుక్‌తో దర్శనం ఇవ్వనుందని తెలుస్తోంది. ఈ సాంగ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మాంచి మసాలా దట్టించి ఉంటుందని....ట్యూన్స్ కూడా ఊపు తెచ్చే విధంగా ఉంటాయని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
మరో ముఖ్య విషయం ఏమిటంటే...ఈ సాంగుకు సోనాక్షి రూ. 6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుటోందట. ఈ సాంగును ఎంత గ్రాండ్‌గా చిత్రీకరిస్తున్నారంటే....ఏకంగా 600 మంది డాన్సర్లు పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. షారుక్ ఖాన్‌కు చెన్నై ఎక్స్‌ప్రెస్ లుంగీ హిట్ ఇచ్చిన యో యో హనీ ఈ సాంగులో కనిపించనున్నారట.
బాలీవుడ్ చరిత్రలోనే బాగా ఖర్చు పెట్టి చిత్రీకరించిన సాంగుగా దీన్ని తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే రౌడీ రాథోడ్, జోకర్, వన్స్ అపాన్ ఎ టైం ఇన్ ముంబై దొబారా లాంటి చిత్రాల తర్వాత అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా కలిసి నటిస్తున్న సాంగు కావడంతో మంచి రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications












