For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గట్టి స్కెచ్ వేసిన నాగ్.. బంగార్రాజు కోసం రంగంలోకి బాలీవుడ్ బ్యూటీ.. రచ్చరచ్చే!

  |

  2016 లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఊపిరి సినిమా తర్వాత నాగార్జున కు సరైన హిట్ పడలేదు.. ఈ ఏడాది కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన వైల్డ్ డాగ్ సినిమాతో మళ్లీ ఆయన హిట్ అందుకున్నాడు. ఇక నాగార్జున ప్రస్తుతం రెండు సినిమాలు లైన్ లో పెట్టారు. ఇవి కాక ఒక తమిళ సినిమా అలాగే ఒక హిందీ సినిమాల్లో కూడా ఆయన నటిస్తున్నారు. తెలుగులో చేస్తున్న రెండు సినిమాల విషయానికి వస్తే ఒక సినిమా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తూ ఉండగా మరొకటి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమా రూపొందుతోంది.. ఆ సినిమాలో ఒక బాలీవుడ్ హీరోయిన్ నటిస్తోంది అంటూ తాజాగా ఆసక్తికర చర్చ మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే

  యాంకర్ వర్షిణి సౌందర్‌రాజన్ గ్లామరస్ ఫోటోలు.. అందాల ఆరబోతతో హంగామా (ఫోటోలు)

  ఇంకా తొలగని బాలారిష్టాలు

  ఇంకా తొలగని బాలారిష్టాలు

  2016లో సోగ్గాడే చిన్ని నాయన అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు నాగార్జున. అందులో బంగార్రాజు, రామ్మోహన్ అనే రెండు పాత్రల్లో నటించి మెప్పించారు.. ఈ సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు సినిమా రూపొందుతోంది. నిజానికి ఈ సినిమా ఉంటుందని సోగ్గాడే చిన్ని నాయన రిలీజ్ అయిన కొద్దిరోజులకే ప్రకటించారు.. కానీ ఈ సినిమా మొదలు కావడానికి ఇప్పటికీ బాలారిష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా త్వరలోనే మొదలు కాబోతోందని నాగార్జున క్లారిటీ ఇచ్చారు.

  క్యాస్టింగ్ లో బిజీ

  క్యాస్టింగ్ లో బిజీ

  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది కరోనా పరిస్థితులు కాస్త కుదుట పడ్డాక మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఫైనల్స్ డ్రాఫ్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అలాగే స్క్రిప్ట్ కి తగ్గట్టుగా ఎవరెవరు ఏయే పాత్రలో నటిస్తే బాగుంటుందని అనే విషయంలో కూడా కసరత్తులు చేస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగంలో హీరోయిన్స్ గా రమ్యకృష్ణ అలాగే లావణ్య త్రిపాఠి నటించారు.

  బాలీవుడ్ హీరోయిన్ రంగంలోకి

  బాలీవుడ్ హీరోయిన్ రంగంలోకి

  ప్రీక్వెల్ గా తెరకెక్కిస్తున్న కారణంగా దాదాపు రమ్యకృష్ణ ఈ సినిమాలో నటించడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. తాజాగా మొదలైన ప్రచారం మేరకు ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను కూడా ఈ సినిమాలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అయితే అది హీరోయిన్ పాత్రనా లేక మరో పాత్రనా అనేది తెలియదు. కానీ ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. బహుశా హీరోయిన్ పాత్ర కాకపోయి ఉండొచ్చని ఒక ముఖ్య పాత్ర కోసం ఆమెను తీసుకుంటూ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.

  ఒప్పుకుంటే మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమా

  ఒప్పుకుంటే మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమా

  స్క్రిప్ట్ ప్రకారం ఈ సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ నటించే అవకాశం ఉండడంతో దర్శక నిర్మాతలు సోనాక్షి సిన్హాను అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కథ మొత్తం విన్న సోనాక్షి త్వరలోనే తన నిర్ణయం చెబుతామని చెప్పినట్లు సమాచారం. ఆమె కనుక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆమె చేయబోతున్న మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమా ఇదే అవుతుంది.

  Ys Jagan పై మూవీ ఉంటుంది, Pawan Kalyan ని హ్యాండిల్ చెయ్యలేను - RGV || Filmibeat Telugu
  కొత్తేమీ కాదు..

  కొత్తేమీ కాదు..

  సోనాక్షి సిన్హా సీనియర్ హీరోలతో నటించడం ఇదేమీ కొత్త కాదు గతంలో అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రజినీకాంత్ లాంటి పెద్ద హీరోలతో సైతం నటించి మెప్పించింది. ఈ నేపథ్యంలో నాగార్జునతో సినిమా చేయడం ఖరారయ్యే అవకాశాలు బాగానే ఉన్నాయని అంటున్నారు. మరి చూడాలి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో ?

  English summary
  Nagarjuna had recently revealed that Bangarraju, the prequel to the blockbuster Soggade Chinni Nayana is presently in the pre-production phase.Some reports reveal that the makers of Bangarraju are planning to rope in Bollywood beauty Sonakshi Sinha for an important role in the film. They have already initiated talks with the acclaimed actress and are awaiting her response.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X