'ఒక్కడు' హిందీ వెర్షన్ హీరోయిన్ ఖరారు
ఈ చిత్రాన్ని అమిత్ మిశ్రా డైరక్ట్ చేస్తున్నారు. అమిత్ మిశ్రా గతంలో పాపులర్ గూగుల్ రీ యూనియన్ యాడ్ ని చిత్రీకరించి చాలా పేరు పొందారు. సంజయ్ కపూర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. మొదట అభిషేక్ బచ్చన్ తో ఈ చిత్రం రీమేక్ అనుకున్నారు కానీ మెటీరియలైజ్ కాలేదు. 'ఇష్క్ జాదేతో బాలీవ్ఞడ్ రంగ ప్రవే శం చేసిన అర్జున్ కపూర్ ఇప్పుడు తండ్రి నిర్మిస్తున్న 'ఒక్కడు రీమేక్‌లో నటిస్తున్నాడు. తండ్రి, తనయుడు కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. చాలాకాలంనుంచి కొడుకుతో సినిమా తీయడానికి మంచి స్క్రిప్టుకోసం ఎదురు చూస్తుండగా ఇప్పటికి ఈ ప్రాజెక్టు ఖరారయింది. రీమేక్ హక్కు లు ఇటీవలే ఫైనల్ అయినట్లు సమాచారం.
బోనీ కపూర్ ఈ విషయమై మాట్లాడుతూ.. ''అవును. 'ఒక్కడు ప్రాజెక్టుపై పనిచేస్తున్నాం. అర్జున్ ప్రధాన పాత్ర పోషిస్తాడు అని చెప్పాడు. తమిళ, కన్నడ భాషల్లోకూడా రీమేక్ చేసిన ఈ చిత్రం హిందీలో తీయదగ్గ సతా గల చిత్రమని అర్జున్ భావిస్తున్నాడు. తెలుగు 'ఒక్కడులో మహేష్ బాబు సరసన నటించిన భూమిక చావ్లా మాట్లాడుతూ ''ఎన్నో దక్షిణాది సినిమాలు హిందీలో రీమేక్ అయ్యాయి. కానీ ఈ చిత్రం రీమేక్ అవ్ఞతుండటం ఎంతో ఆనందంగా ఉంది అంది.
ఇప్పటికే అర్జున్ కపూర్ 'ఇషక్ జాదే' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టాడు. ఒక్కడు చిత్రంలో మహేష్ బాబు పోషించిన పాత్ర అర్జున్‌కు కరెక్ట్ గా సూటవుతుందని, అర్జున్ బాడీ లాంగ్వేజ్ ఆ సినిమాకు పర్ ఫెక్ట్ గా ఉంటుందని బాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు. అర్జున్ కపూర్ ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి సవితి కొడుకు. బోని కపూర్-మోనా పెళ్లయిన పదేళ్ల తర్వాత విడి పోయారు. వీరి సంతానమే అర్జున్ కపూర్.


Click it and Unblock the Notifications












