స్టార్ హీరో కుమార్తెతో చిరు రొమాన్స్.. ఆ సినిమా కోసం ఫిక్స్ చేసిన డైరెక్టర్?
సైరా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా ప్రారంభించారు. అయితే ఆ సినిమా అనుకోకుండా కరోనా కారణంగా చాలా లేట్ అవుతోంది. ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో చిరంజీవి మరో మూడు సినిమాలు సిద్ధం చేశారు. అందులో ఒక సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు స్టార్ హీరో కుమార్తెను సంప్రదించినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.

సైరా తరువాత గ్యాప్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి జరగకపోయినా ఇంకొంత పూర్తి చేయాల్సిన కొంత ప్యాచ్ వర్క్ మిగిలి పోయింది. మళ్ళీ షూటింగులు మొదలుపెట్టిన తరుణంలో ఈ సినిమా షూటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్లానింగ్ చేస్తున్నారు.

మరో మూడు సినిమాలు లైన్ లో
ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే చిరంజీవి మరో మూడు సినిమాలు ప్రకటించారు. అందులో ఒకటి మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమా రీమేక్ కాగా, మరొకటి తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం రీమేక్. ఇక వీటిలో లూసిఫర్ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా మరో సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలు కాకుండా ఆయన దర్శకుడు బాబీతో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.

బాబీ సినిమా కోసం హాట్ బ్యూటీ
ఇక బాబీ తెరకెక్కించబోయే సినిమా కోసం చిరంజీవి సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ, స్టార్ హీరో కుమార్తె సోనాక్షి సిన్హా ను ఎంపిక చేశారని అంటున్నారు. ఆమె కూడా ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుందని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా కోసం బాబీ ఎమోషన్ మరియు యాక్షన్‌తో కూడిన ఆసక్తికరమైన కథతో వస్తున్నారని అంటున్నారు.

జగన్ తో భేటీ
ఇక మెగాస్టార్ త్వరలో ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలవబోతున్నట్లు కథనాలు వినవస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం సినిమాలకు సంబంధించిన టికెట్ల రేట్ల విషయంలో ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అలాగే బెనిఫిట్ షోలకు కూడా అనుమతులు ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తోంది. వకీల్ సాబ్ టైమ్ లో టికెట్ల రేట్లు సడన్ గా తగ్గించడంతో నిర్మాతలు అందరూ ఇప్పుడు చిరంజీవికి మొరపెట్టుకోగా ఈ టికెట్ రేట్లు పెంచుకునేలా అనుమతి కోరాడానికి మెగాస్టార్ సిద్ధమైనట్లు సమాచారం.

ఆచార్య మీద అంచనాలు
ఇక చిరంజీవి ఆచార్యలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను రామ్ చరణ్ మరియు నిరంజన్ రెడ్డి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











