బాలయ్యతో నాలుగోసారి నో చెప్పిన హాట్ బ్యూటీ.. అందుకే ఇంకొకరి కోసం అన్వేషణ!

వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ నేపథ్యంలోనే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడాయన. ఇందుకోసం తనకు గతంలో 'సింహా', 'లెజెండ్' వంటి రెండు విజయాలను అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో జత కట్టాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా బాలయ్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని 2021 ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని యూనిట్ భావిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా వరకు షూటింగ్ జరిగిపోయింది. అయినప్పటికీ ఇందులో నటించే హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. వాస్తవానికి ఈ సినిమాలో కొత్త హీరోయిన్‌ను తీసుకోబోతున్నాం అని బోయపాటి శ్రీను గతంలోనే ప్రకటించారు. కానీ, తరచూ ఎవరో ఒక హీరోయిన్ పేరు తెరపైకి వస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నటించేందుకు సోనాల్ చౌహాన్ నిరాకరించిందనేదే ఆ వార్త సారాంశం.

Sonal Chauhan Reject Nandamuri Balakrishna Movie

నందమూరి బాలకృష్ణ నటించిన 'లెజెండ్', 'డిక్టేటర్', 'రూలర్'లలో హీరోయిన్‌గా చేసిన సోనాల్‌ను.. తమ సినిమా కోసం సంప్రదించాడట బోయపాటి. ఎంతో కీలకమైన ఓ పాత్ర కోసం అడగగా, ఆమె రిజెక్ట్ చేసిందని అంటున్నారు. అందుకోసమే మరో హీరోయిన్ కోసం అన్వేషణ కొనసాగిస్తుందట చిత్ర యూనిట్. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, అందులో ఒకటి అఘోరా లుక్ అని కూడా అంటున్నారు. ఇక, ఇందులో శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X