బాలయ్య హీరోయిన్‌కి లక్కీ ఛాన్స్.. మహేష్ బాబుతో రొమాన్స్!
Recommended Video

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. ఊపిరి చిత్రం తరువాత మహేష్ బాబు కోసం వంశీ పైడిపల్లి దాదాపు రెండేళ్లపాటు ఎదురుచూశాడు. ఈ ఏడాది విడుదలైన మహేష్ చిత్రం భరత్ అనే నేను తరువాత వంశీ దర్శత్వం వహించే మహర్షి సెట్స్ పైకి వెళ్ళింది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం కీలక దశలో ఉంది. మహేష్ నటించే సినిమాపై ఎప్పుడూ అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. మహర్షి చిత్రాన్ని దర్శకుడు ఓ ఆసక్తికరమైన కథతో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే రెండో హీరోయిన్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

మూడు కోణాల్లో మహేష్
ఈ చిత్రంలో మహేష్ బాబు పాత్ర మూడు కోణాల్లో ఆవిష్కరించబోతున్నారు. కాలేజీ స్టూడెంట్ గా, పెద్ద కార్పొరేట్ సంస్థకు సీఈఓగా, రైతు సమస్యలని పరిష్కరించడానికి ఇండియా వచ్చే వ్యక్తిగా మహేష్ పాత్రని చూపించబోతున్నారు. వంశీ పైడిపల్లి చిత్రాలు బలమైన కథని కలిగి ఉంటాయి. మహర్షి చిత్రం విషయంలో కూడా అభిమానులు అదే ఆశిస్తున్నారు.

బాలయ్య హీరోయిన్‌కు ఛాన్స్
మహర్షి చిత్రంలో సెకండ్ హీరోయిన్ కు కూడా ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు వంశీపైడిపల్లి ఈ పాత్ర కోసం సోనాల్ చౌహన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బాలయ్య సరసన లెజెండ్, డిక్టేటర్ చిత్రాల్లో సోనాల్ చౌహన్ నటించింది. పండగ చేస్కో, సైజు జీరో చిత్రాల్లో కూడా మెరిసింది. గ్లామర్, నటన పరంగా సోనాల్ చౌహన్ కు మంచి మార్కులే పడ్డాయి.

సీఈవో పక్కనే
మహేష్ ఈ చిత్రంలో సీఈవోగా నటించే సన్నివేశాల్లో సోనాల్ చౌహన్ కనిపించనుందట. గ్లామర్, నటన అన్నీ ఉన్నా సోనాల్ చౌహన్ కు తగిన గుర్తింపు రాలేదు. మహర్షి చిత్రంలో ఈ అమ్మడికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడి పాత్రలో పల్లెటూరి యువకుడిగా నటించనున్నాడు.

వేసవి కానుకగా
2019 ఏప్రిల్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు, అశ్విని దత్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరికొత్త గెటప్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.


Click it and Unblock the Notifications











