‘F3’ మూవీలో మరో హీరోయిన్ కూడా: ముఖ్యమైన పాత్రలో మెరవనున్న హాట్ బ్యూటీ
విక్టరీ వెంకటేష్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తోన్న చిత్రం 'F3'. కొన్నేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్)కు సీక్వెల్‌గా వస్తోందీ చిత్రం. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో జాగ్రత్తగా దీన్ని తెరకెక్కిస్తున్నాడు. మొదటి భాగంతో పోల్చుకుంటే మరింత ఫన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం ఎన్నో ప్రయోగాలతో ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. 'F3' మూవీలో మరో హీరోయిన్ కూడా నటిస్తుందట. ఆమె మరెవరో కాదు.. గతంలో పలు తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించిన సోనాల్ చౌహాన్. అవును.. ఈమెనే అత్యంత కీలకమైన ఓ పాత్ర కోసం తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కథను ఆమెకు వినిపించాడట దర్శకుడు అనిల్ రావిపూడి. అది ఆమెకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసిందని అంటున్నారు. కొద్ది సేపే ఉన్నప్పటికీ ఈ పాత్ర ఎంతో మజాను పంచుతుందని టాక్. సోనాల్ గతంలో 'లెజెండ్', 'డిక్టేటర్', 'పండగ చేస్కో', 'సైజ్ జీరో', 'రూలర్' వంటి చిత్రాలు చేసింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'F3' మూవీలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. శ్రీ వెంటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మనీ వల్ల వచ్చే ప్రస్టేషన్స్ ఎలా ఉంటాయోనన్న కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారు. ఇక, ఇందులో వెంకటేష్ కంటి సమస్య ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, వరుణ్ పాత్ర కూడా కొత్తగా ఉంటుందట. వీళ్లతో పాటు ఈ సారి సునీల్ కూడా ఇందులో నటిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











