కుర్ర హీరోతో బాలయ్య హీరోయిన్ సరసాలు

By Srikanya

హైదరాబాద్ : కొంత మంది హీరోయిన్స్ కెరీర్ ఊహించిన విధంగా జోరు అందుకోదు. సరైన బ్రేక్ వస్తే కానీ ఇండస్ట్రీ పట్టించుకోదు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు 'లెజెండ్‌'తో విజయాన్ని సొంతం చేసుకొన్న సోనాల్‌ చౌహాన్‌. ఆమెకి తెలుగులో మరో అవకాశం దక్కింది. 'పండగ చేస్కో' చిత్రంలో ఓ హీరోయిన్ గా ఎంపికైంది. రామ్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి ప్రసాద్‌ నిర్మాత. ఇందులో ఓ హీరోయిన్ గా ఇప్పటికే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ని ఎంపిక చేసుకొన్నారు. సెకండ్ హీరోయిన్ గా సోనాల్‌ సందడి చేయబోతోందన్నమాట.

'రెయిన్‌ బో'తో తెలుగు తెరకి పరిచయమైంది సోనాల్‌. ఆ సినిమా పరాజయాన్ని చవిచూడటంతో ఆమెకు అవకాశాలు దక్కలేదు. దీంతో తమిళం, హిందీ సినిమాల్లో నటిస్తూ గడిపింది. ఇటీవల 'లెజెండ్‌'లో బాలకృష్ణ సరసన ఆడిపాడటానికి బాలీవుడ్‌ నుంచి వెళ్లి సోనాల్‌ను తీసుకొచ్చారు. ఆ చిత్రం విజయవంతం కావడంతో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశ పెట్టుకొంది. కాస్త ఆలస్యమైనా మరో మంచి అవకాశాన్ని చేజిక్కించుకొంది సోనాల్‌.

Sonal to Join Ram and Rakhul?

చిత్ర సమర్పకుడు పరుచూరి ప్రసాద్‌ మాట్లాడుతూ ''వాణిజ్య అంశాలన్నీ మేళవించిన కథ ఇది. టైటిల్‌కి మంచి స్పందన వస్తోంది. రామ్‌ నటన, ఆయన పాత్ర తీరుతెన్నులు కొత్తగా ఉంటాయి. '' అన్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ''రామ్‌లోని హుషారుకి తగిన కథ ఇది. మాస్‌, యాక్షన్‌, వినోదం.. ఇవన్నీ కలగలిసి ఉంటుంది. డాన్‌శీను', 'బాడీగార్డ్', 'బలుపు' వంటి హిట్ చిత్రాల తరువాత చేస్తున్న సినిమా ఇది. రామ్ ఎనర్జీకి తగినట్లుగా మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించడానికి సబ్జెక్ట్ రెడీ చేశాం. రామ్‌కిది మరో మంచి సినిమా అవుతుంది' అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ''స్క్రిప్టు బాగా వచ్చింది. రామ్‌ కెరీర్‌లో మర్చిపోలేని చిత్రం అవుతుంది. హీ ''అన్నారు . వరసగా మూడు డిజాస్టర్ ఫ్లాపులు(ఎందుకంటే ప్రేమంట,ఒంగోలు గిత్త,మసాలా) అందించిన రామ్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X