twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మహేష్-శ్రీను వైట్ల' చిత్రం హీరోయిన్ ఆమే?

    By Srikanya
    |

    శ్రీను వైట్ల, మహేష్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా సోనమ్ కపూర్ ని ట్రై చేస్తున్నట్లు సమాచారం. సావారియా, డిల్లీ-6 చిత్రాలతో పాపులర్ అయిన ఆమె ఈ చిత్రంలో మహేష్ కు పెయిర్ గా ఉంటే బావుంటుందని తలపోస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఎక్కువ భాగం ఓ పెద్ద ఇంటిలో జరగనుంది. ఈ మేరకు ఆర్ట్ డైరక్టర్ తో డిజైన్స్ తయారు చేసి సెట్ వేయించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రం బేసిక్ గా లవ్ స్టోరి అని కామిడీ,యాక్షన్ సమపాళ్ళలో మిక్స్ చేసి ప్రస్తుతం స్క్రిప్టు రైటర్స్ వంట చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇందులో మహేష్ ని ప్రత్యేకమైన గెటప్ లో చూపి మార్కులు కొట్టాలని వైట్ల ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం.

    ప్రస్తుతం శ్రీను వైట్ల, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన నమో వెంకటేశ చిత్రం రిలీజ్ కావటంతో ఆ ప్రమేషన్ ప్లాన్ చేస్తున్నారు. శ్రీను వైట్ల మార్కు కామిడీ ఈ చిత్రానికి ప్లస్ కావాలని, మహేష్ కిది డిఫెరెంట్ జనర్ కానుందని వినపడుతోంది. ఇక మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న చిత్రం షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఈ చిత్రాన్ని శింగనమల రమేష్ నిర్మిస్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ తో కలిసి పులి చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X