పవర్ స్టార్‌తో ఏమోగానీ...మణిరత్నంతో సోనమ్ ఖరారు?
బాలీవడ్ భామ, అనీల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తుందని గత కొంత కాలంగా పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ సినిమాలో ఆమె నటిస్తుందో? లేదో? ఖశ్చితంగా తెలియదు కానీ.....ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమా ద్వారా తొలి సారిగా దక్షిణాది సినిమా రంగంలోకి అడుగుపెట్టబోతోంది సోనమ్.
మణిరత్నం తాను తీయబోయే తమిళ సినిమాలో సోనమ్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. పెద్ద దర్శకుడు కావడంతో సోనమ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఈసినిమా తెలుగులో విడుదల కాబోతోంది. కార్తీక్ తనయుడు గౌతం హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు తొలుత రాధ చిన్న కూతురు తులసి, కమల్ చిన్న కూతురు అక్షర పేర్లు వినిపించినప్పటికీ చివరకు సోనమ్ పేరు ఖరారైనట్లు తమిళ సినీ వర్గాల సమాచారం. అయితే ఈ విషయం మణి రత్నం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వాస్తవానికి ఇప్పుడు మణి రత్నం ఐశ్వర్య, అభిషేక్ లతో సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ...ఐశ్వర్య ఇటీవల ఓ బిడ్డకు జన్మనివ్వడంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టాడు.


Click it and Unblock the Notifications











