పవన్ కళ్యాణ్‌తో్ సోనమ్ కపూర్?
బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేయనుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది సినీ వర్గాల నుంచి. తాజాగా అందిన సమాచారం ప్రకారం నిర్మాత డివివి దానయ్య పవన్ కళ్యాణ్ హీరోగా నిర్మించబోయే చిత్రానికి సోనమ్ కపూర్ ను హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తూంది. అదే విధంగా మరో వాదన కూడా వినిపిస్తోంది. ఈ సినిమాలో కూడా శృతి హాసన్నే హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉందని మరికొందరంటున్నారు. ప్రస్తుతం శృతి పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాతో పాటు పెండింగులో ఉన్న మరో ప్రాజెక్టు పూర్తయిన తర్వాత డివివి దానయ్య సినిమా సెట్స్ మీదనకు వచ్చే అవకాశం ఉంది. కథ ఇప్పటికే సిద్ధంగా ఉ న్న సినిమాకు ఓ ప్రముఖ దర్శకుడిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తూంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక...ఇటీవ విడుదలైన వవన్ కళ్యాణ్ తాజా సినిమా 'పంజా"ఆడియోకు శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా టైటిల్ సాంగ్, బ్రహ్మానందంపై కామెడీ నేపథ్యంలో సాగే పాపారాయుడు పాటకు ఎక్కువగా స్పందన వస్తోంది.


Click it and Unblock the Notifications











