వినాయకుడు విజయం అనంతరం హ్యాపీగర్ల్ సోనియాకు పెద్ద బ్యానర్స్ నుండి ఆఫర్స్ వచ్చాయి. అయితే తన తలతిక్క నిర్ణయాలతో మంచి ఆఫర్స్ పోగొట్టుకుంటోదని అంతటా వినపడుతోంది. పనిలో పనిగా ఆమె తన భోయ్ ప్రెండ్స్ సలహా మేరకు తన రెమ్యునేషన్ సైతం పెంచిందని అంటున్నారు. అయితే కెరీర్ తొలినాళ్ళలోనే ఇరవై లక్షలు పైగా డిమాండ్ చేయటం చాలా మందికి రుచించటం లేదని అంటున్నారు. ముంబయి నుంచి తెచ్చే అమ్మాయిలకు మహా అయితే అన్ని ఖర్చులు కలిపి ఐదు లక్షలు దాటవని సోనియాని పెట్టుకోవటం వల్ల ప్రత్యేకంగా మార్కెట్ ఏముందని, కాస్త పట్టు విడుపులతో వెళితే ఆమె కెరీర్ నిలబడుతుంది అంటున్నారు. అందులోనూ ఆమె ప్రయోగాత్మకమైన చిత్రాలలోనే నటిస్తుందని, కథ విని క్యారెక్టర్ నచ్చితేనే చేస్తానంటోందని కొందరు నిర్మాతలు అంటున్నారని తెలుస్తోంది. అయితే ఆమె డేట్స్ పొందని వారే ఆ రకమైన నెగిటివ్ ప్రచారానికి ప్రాణం పోస్తున్నారని ఆమె శ్రేయాభిలాషులు అంటున్నారు. ఎవరు ఏం చేసినా దెబ్బతినేది సోనియా కెరీర్ మాత్రమే కాబట్టి ఆమె జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తన వైవిద్యమైన నటనతో న్యూడిల్స్ లాంటి జుట్టుతో గెలుస్తోస్తున్న ఆమె మాత్రం వీటికి సంబంధం లేనట్లు ఉంది.