For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇది తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. సోనూ సూద్ రోజుకు ఎంత తీసుకున్నాడంటే?

    |

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. కరోనా వైరస్ వల్ల నష్టాలు లాభాలు జరిగాయి. నష్టాలు మనుషులకు జరిగితే లాభాలు మాత్రం ప్రకృతికి జరిగింది. ఇలా కరోనా విజృంభించడంతో మనుషుల్లో దాగి ఉన్న మానవత్వం కూడా బయటకు వచ్చింది. అయితే దేశ మొత్తం సగర్వంగా చూసింది మాత్రం సోనూ సూద్‌నే. సోనూ సూద్ ఏకంగా బద్రర్ ఆఫ్ ది నేషన్ అంటూ జనాలు కీర్తించారు.

    సోనూ సూద్ విలన్ కాదు..

    సోనూ సూద్ విలన్ కాదు..

    సోనూ సూద్ ఒకప్పుడు విలన్. వెండితెరపై భయంకరమైన విలనిజాన్ని, శాడిజాన్ని ప్రదర్శించి గుండెల్లో భయం పుట్టించాడు. కానీ ఇదంతా కరోనా కంటే ముందు. ఇకపై సోనూ సూద్ అంతటి శాడిజాన్ని చూపించినా ఎవ్వరూ అది ఒప్పుకోరు. అందరూ సోనూ సూద్‌ను హీరోగానే గుర్తిస్తారు.. గురిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇండియాకు సోనూ సూద్ సూపర్ హీరో అయ్యాడు.

    ఎన్ని సేవలు, సాయాలు..

    ఎన్ని సేవలు, సాయాలు..

    సోనూ సూద్ చేసిన, చేస్తోన్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతంది. సోనూ సూద్ చేసే సాయాల గురించి చెప్పాలంటే రోజులు చాలవు. ఇప్పటికీ సోనూ సూద్ సాయమందిస్తూనే ఉన్నాడు. ఆపదలో ఉన్నామంటే చాలు ఎంతైనా చేసి పెడుతున్నాడు. ఎక్కడి దాకా అయినా వెళ్తున్నాడు. చిన్నారి గుండెకు ఆపరేషన్, బాలికల విద్య కోసం, అమ్మ ఆరోగ్యం కోసం ఇలా సోనూ సూద్ దేశ ప్రజలకు చేస్తోన్న సాయం గురించి ఎంత చెప్పినా తక్కువే.

     సోనూ సూద్ నేషనల్ స్టార్..

    సోనూ సూద్ నేషనల్ స్టార్..

    సోనూ సూద్ ఇప్పుడు నేషనల్ స్టార్. దేశ వ్యాప్తంగా సోనూ సూద్ అభిమాన సంఘాలు, అభిమానులున్నారు. అలాంటి సోనూ సూద్ వాల్యూ మార్కెట్‌లో బాగా పెరిగింది. అందుకు తగ్గట్టే తన పారితోషికాన్ని పెంచినట్టు తెలుస్తోంది. రోజుకు సోనూ సూద్ భారీ మొత్తంలో డిమాండ్ చేస్తోన్నట్టు సమాచారం.

    రోజుకు ఇరవై లక్షలా?..

    రోజుకు ఇరవై లక్షలా?..

    సోనూ సూద్ రోజుకు ఇరవై లక్షలు తీసుకుంటున్నాడని టాక్. ఈ లెక్కన సోనూ సూద్ ఎన్ని రోజులు పని చేస్తే అన్ని ఇరవై లక్షలు ఇచ్చుకోవాల్సిందేనట. ఇలా క‌నీసం 15 నుంచి 20 రోజుల షూటింగ్ చేస్తే దాదాపు 4 కోట్ల‌ వరకు రెమ్యూనరేషన్ ఉంటుందన్న మాట. ఇవి కాకుండా అదనపు ఖర్చులు కూడా నిర్మాతే భరించుకోవాలట. మొత్తానికి సోనూ సూద్ రేంజ్ మామూలుగా లేదని తెలిసిపోతోంది.

    English summary
    Sonu Sood Demanding Huge Remuneration For Telugu Movies, Sonu Sood Gets UNDP Appreciation, has been conferred with the prestigious SDG Special Humanitarian Action Award by the United Nations Development Programme,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X