త్రివిక్రమ్, దానయ్యలకు సోనుసూద్ షాక్

ప్రస్తుతం తివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నిర్మాత డివివి దానయ్య 'హనీ'(వర్కింగ్ టైటిల్) అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విలన్ రోల్ కోసం దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత దానయ్య సోనూ సూద్ ను సంప్రదించగా 50రోజుల డేట్స్ఇవ్వడానికి రూ. 80 లక్షలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడట. తక్కువ బడ్జెట్ లో సినిమా పూర్తి చేద్దామనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్న దర్శక, నిర్మాతలు సోను డిమాండ్ కు షాకయ్యారు.
ఈ చిత్రంలో అల్లున్ సరసన ఇలియాన రొమాన్స్ చేస్తోంది. మరో మూడు నెలల్లో ఈ చిత్రం షూటింగు పార్టు పూర్తి కానుంది.


Click it and Unblock the Notifications











