పాన్ ఇండియా సినిమాగా శక్తి మాన్ స్టోరీ.. టాలీవుడ్ హీరోలపైనే బడా సంస్థ ఫోకస్.. ఎవరంటే?

ఇటీవల కాలంలో లోకల్ సినిమాల్లో కంటే కూడా అన్ని భాషల్లోనూ సినిమాలను విడుదల చేసే విధంగా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు లోకల్ కంటెంట్ కాకుండా వరల్డ్ కంటెంట్ అనే విధంగా దర్శకుడు ఆలోచిస్తున్నారు. ఇక బాహుబలి సినిమా సక్సెస్ అయిన తర్వాత అందరి ఫోకస్ కూడా ఎక్కువగా టాలీవుడ్ పైనే పడింది ఇక ఇటీవల పుష్ప సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో మన హీరోలపై కొన్ని పెద్ద ప్రొడక్షన్ సంస్థలు ఫోకస్ పెట్టాయి. త్వరలోనే శక్తి మాన్ సీరీస్ ను స్టార్ట్ చేయబోయే సోనీ పిక్చర్స్ కూడా తెలుగు హీరోల పైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే...

వెండితెరపై శక్తి మాన్

వెండితెరపై శక్తి మాన్

90ల కాలంలో భాషతో సంబంధం లేకుండా అందరినీ ఎంతగానో ఆకట్టుకున్న సీరియల్స్ లో శక్తిమాన్ నెంబర్ వన్ లిస్టు లో ఉంటుంది అని చెప్పవచ్చు. ముఖేష్ కన్నా శక్తిమాన్ గా కనిపించిన విధానం అప్పట్లో దాదాపు అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేది. కేవలం గ్రాఫిక్స్ తోనే కాకుండా మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా శక్తిమాన్ చేసిన సాహసాలు చిన్నారులను ఎంతగానో ఉత్తేజపరిచింది. ఇక ఇప్పుడు ఆ కథతోనే శక్తిమాన్ ప్రాజెక్టును వెండి తెర పైకి తీసుకు రావాలని చూస్తున్నారు.

 భారీ స్థాయిలో మూడు భాగాలుగా..

భారీ స్థాయిలో మూడు భాగాలుగా..

ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ గత ఏడాది నుంచి శక్తిమాన్ ప్రాజెక్టుపై బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ కూడా రెడీ చేయించారట. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ రచయితలు ఆ స్క్రిప్ట్ కోసం పని చేసినట్లుగా తెలుస్తోంది. కేవలం ఒక భాషలోనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా మూడు పార్ట్ లు కథను సిద్ధం చేసి ఉంచారట. సినిమాను విదేశీ భాషల్లోకి అనువాదం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 బాలీవుడ్ హీరోలైతే కాదట..?

బాలీవుడ్ హీరోలైతే కాదట..?

అయితే శక్తిమాన్ సిరీస్ ను సినిమాగా తెరపైకి తీసుకు వస్తే అందులో హీరోగా ఎవరు నటిస్తాడు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. సోనీ పిక్చర్స్ అయితే ఎక్కువగా టాలీవుడ్ హీరోలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇదివరకే బాలీవుడ్ ఇండస్ట్రీలో హృతిక్ రోషన్ వంటి హీరోలు క్రిష్ లాంటి సూపర్ హీరో ప్రాజెక్టులను చేశారు. అయితే ఆయనకు మాత్రం సౌత్ ఇండస్ట్రీలో పెద్దగా మార్కెట్ లేదు. కాబట్టి సోనీ పిక్చర్స్ బాలీవుడ్ హీరోలపై ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనిపించడం లేదు.

 మొదట ప్రభాస్?

మొదట ప్రభాస్?

ఇక తెలుగులో దాదాపుగా అగ్ర హీరోలు అందరూ కూడా ఫ్యాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు ముఖ్యంగా ప్రభాస్ అయితే పాన్ వరల్డ్ అనే స్థాయికి చేరుకుంటున్నారు కాబట్టి సోనీ పిక్చర్స్ మొదట ప్రభాస్ తో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. కానీ ప్రభాస్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా చాలా పెద్ద లైనప్ తో బిజీగా ఉండడంతో అతనికి కుదరకపోవచ్చు అనే అనుమానం కూడా వస్తుంది.

లిస్టులో అల్లు అర్జున్..

లిస్టులో అల్లు అర్జున్..

అలాగే మరో వైపు అల్లు అర్జున్ తో కూడా సోనీ పిక్చర్స్ ఒకసారి చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఇటీవల అల్లు అర్జున్ బాలీవుడ్ ఇండస్ట్రీలో పుష్ప సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే ఆ సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల నెట్ కలెక్షన్ అందుకోవడం విశేషం. కాబట్టి అతను కూడా లిస్టు లో ఉండే అవకాశం ఉంది. మరి సోనీ పిక్చర్స్ ఈ ఇద్దరు హీరోల్లో ఎవరినైనా సెలెక్ట్ చేసుకుంటుందా? లేదా మరే హీరోనైనా సంప్రదిస్తారా అనేది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X