అక్కడలాగా ఇక్కడ కూడా అయితే బన్నీ షేక్ ఆడించేస్తాడు..!?
ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమాను అన్న దమ్ములైన సూర్య, కార్తిక్ లు షేక్ చేసేస్తున్నారు. అదే విధంగా నేను చరణ్ కూడా చేసే రోజు రావాలని అల్లు అర్జున్ ఆశిస్తున్నాడట. ఏ తమిళ్ సినిమా తీసుకున్నా డబ్బింగ్ అవుతూ తెలుగులో మంచి మార్కెట్ వుంది. తమిళ్ హిరోలకు కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఓపినింగ్స్ కూడా బాగానే రాబడుతున్నారు. అదే విధమైన మార్కెట్ మన తెలుగు హిరోలకు తమిళ్ లో లేదు.
కన్నడంలో వేరే బాష సినిమాలు డబ్బింగ్ చేయనివ్వరు, కాని డైరక్ట్ తెలుగు సినిమాలకు మంచి డిమాండ్ వుంది. హిరోలకు కూడా మంచి క్రేజ్ వుంది. కేరళలో ఒకే ఒక్క తెలుగు హిరోకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ ఒక్కడే అల్లు అర్జున్. వాళ్ళు మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. ఎంత క్రేజ్ అంటే డాన్స్ ప్రొగ్రామ్స్ కాంపీటేషన్ కు మన బన్నీ పోస్టర్స్ తో ప్లేక్సీలతో పబ్లిసిటీ చేస్తున్నారు. ఇదే రకమైన గ్రిప్ తమిళ్ లో కూడా సాధిస్తే, బన్నీ సౌత్ ఇండియా సినిమాను షేక్ చేసే రోజు తప్పకుండా వస్తుందనడంలో సందేహం లేదు.
కాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఈ కొత్త వెంచర్ నవంబర్ 2 నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రం లో ఇలియానా హీరోయిన్ గా నటించబోతుంది. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తారు. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం రొమాంటిక్ కోణంలో సాగే ఈ కామెడి ఎంటర్టైనర్ ను దానయ్య నిర్మిస్తున్నారు. భుజం గాయం కు చికిత్స నిమిత్తం అల్లు అర్జున్ ఆస్ట్రేలియా వెళ్లి రావటం కారణంగా ఈ చిత్ర ప్రారంభం కాస్త ఆలస్యం అయినట్టు తెలుస్తోంది.గాయం నుంచి తను ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నానని చిత్ర షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీగా ఉన్నానంటున్నారు అల్లు అర్జున్.


Click it and Unblock the Notifications











