గోపీచంద్ చిత్రం హిందీ రీమేక్ లో సల్మాన్ ఖరారు

By Srikanya

ముంబై : హిందీ హీరోలు ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఎక్కువగా దక్షిణాది రీమేక్ ల మీదే ఆధారపడుతున్న సంగతి తెలసిందే. తాజాగా ఆయన గోపీచంద్ హీరోగా వచ్చిన 'శౌర్యం' చిత్రం రీమేక్ చేయటానికి సిద్దమవుతున్నారు. 2013 లో రూపొందే ఈ చిత్రం కోసం సల్మాన్ తన డేట్స్ ని బల్క్ గా ఇస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని టిప్స్ కంపెనీకి చెందిన కుమార్ తురాని రైట్స్ తీసుకున్నారు. ఆయనే ఆర్య, డాన్ శీను, శౌర్యం రైట్స్ తీసుకున్నారు. వీటిలో మొదటగా శౌర్యం రీమేక్ ప్రారంబించనున్నారు. దర్శకుడు ఎవరనేది ఇంకా తేలలేదని సమాచారం.

ఇక ఈ చిత్రాన్ని కెమెరామెన్ నుంచి దర్శకుడుగా మారిన శివ డైరక్ట్ చేసారు. 2008లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్నే సాధించింది. అనూష్క, గోపీచంద్ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం మళయాళంలోకి డబ్ అయ్యింది. అలాగే హిందీలోకి మేరీ సంపత్ టైటిల్ తో డబ్ అయ్యింది. అలాగే కన్నడంలో దర్శన్ హీరోగా మదాలస శర్మ హీరోయిన్ గా శౌర్య పేరుతో రీమేక్ అయ్యింది. తమిళంలో ఈ చిత్రాన్ని ఆ మధ్య ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్, సమీరారెడ్డి జంటగా తమిళంలో రూపొందించారు. జీకే ఫిలిం కార్పొరేషన్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి శ్రేయారెడ్డి నిర్మాణ సారధ్యం వహించారు. ఈ చిత్రాన్ని వేడి టైటిల్ పెట్టారు.

ప్రస్తుతం తెలుగులో ఘన విజయం సాధించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాని హిందీలో రీమేక్‌ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. హిందీ రీమేక్‌కి కుమార్‌ తరౌనీ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ సినిమాతో ఆయన కుమారుడు గిరీష్‌ కథానాయకుడిగా పరిచయం కాబోతున్నారు. సమంతని హీరోయిన్ గా ఎంచుకొనే అవకాశాలున్నాయి. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

ఇప్పటికే ఓ టీమ్ ..'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' స్క్ర్రిప్టులో ఛేంజ్ లు రాసి,నార్త్ కి తగినట్లు కామిడీని మార్చి తిరగరాస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుదేవా బాలీవుడ్ లో రూపొందించిన 'రౌడీ రాథోర్'ఘన విజయం సాధించింది. అక్షయ్ కుమార్ హీరోగా చేసిన ఈ చిత్రం తెలుగులో రాజమౌళి-రవితేజ కాంబినేషన్లో వచ్చిన 'విక్రమార్కుడు' చిత్రానికి రీమేక్. ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ రావటంతో బాలీవుడ్ హీరోల దృష్టి మొత్తం ప్రభుదేవాపై పడింది. అందులోనూ సల్మాన్ ఖాన్ తో పోకిరి రీమేక్ ని వాంటెండ్ పేరుతో తీసి సూపర్ హిట్ చేయటం,ఇప్పుడు దక్షిణాది చిత్రాక కధల హవా నడవటం ఈ ప్రభుదేవాకు కలిసివచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X