40 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి.. ఆ ప్రముఖ నటి ఎవరో తెలుసా?
మన దగ్గర సినిమా లేదా క్రికెట్ సంబంధించి చాలా మంది ప్రముఖులు పర్శనల్ జీవితాలు ఒకింత ఆసక్తికరంగానే ఉంటాయని చెప్పాలి. అయితే కొందరు తమ చర్యలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు లేకపోతే ట్రోల్స్ కి గురవుతారు. కాగా ఒక సెలెబ్రెటీకి సంబంధించి తమ వైవాహిక బందం అనేది ఎప్పుడూ ఒకింత ఆసక్తిగానే ఉంటుంది. ఇలా ఓ హీరో లేదా ఓ హీరోయిన్ వంటి వారు ఒక పెళ్లి ఓకే రెండో పెళ్లి లేదా రెండో సంబంధం వంటివి అందరిలో కళ్ళు చిన్నగా చెప్పి చూసేలా చేస్తాయి.
ఇక మూడో పెళ్లి అనేసరికి అది ఇంకా పెద్ద విషయం అయిపోతుంది. కాగా సినీ పరిశ్రమలో అందులోని మన సౌత్ సినిమా దగ్గర రెండేసి పెళ్లిళ్లు చేసుకున్న ప్రముఖులు, తారలు చాలా మందే ఉన్నారు. కానీ మూడేసి, నాలుగేసి పెళ్లిళ్లు చేసుకున్న వారు కూడా ఉన్నారా అంటే అలా తక్కువ మందే కనిపిస్తారు.

తెలుగు సినిమా ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ అయితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని ఇప్పటికీ కొంతమంది రాద్ధాంతం చేస్తుంటారు. ఇలాంటి అంశాలపై కొందరు మెచ్యూర్ గానే ఆలోచిస్తారు. అయితే ఇలాంటివి ఒక మగవాడి విషయంలో పెద్దవిగా ఆడవారి విషయంలో చిన్నవిగా కనిపిస్తాయి అని కొందరు కామెంట్స్ చేస్తారు.
మరి కొందరు మేల్ స్టార్స్ మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే అన్ని కామెంట్స్ చేస్తారు కానీ ఇప్పుడు ఓ ప్రముఖ నటి ఏకంగా నాలుగో పెళ్ళికి సిద్ధం అయ్యింది అనే రూమర్స్ కొన్ని వినిపిస్తుంన్నాయి. కాగా ఆ నటి తమిళ్, తెలుగులో పలు చిత్రాలు చేసిన వనితా విజయ్ కుమార్ అట. ఈమె మన తెలుగులో సోషియో ఫాంటసీ మూవీ "దేవి" సినిమాతో బాగా తెలిసి ఉంటారు.
కాగా రీసెంట్ గా అయితే నరేష్ "మళ్ళీ పెళ్లి" సినిమాలో ఆమె నరేష్ భార్యగా అతని మరో పెళ్లిపై పోరాడే భార్యగాక చూపిస్తారు. కానీ ఈమె రియల్ లైఫ్ లో మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. కాగా ఇప్పుడు మూడో భర్తకి కూడా విడాకులు ఇచ్చి నాలుగో పెళ్లి చేసుకోనున్నారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈమెకి 2000 సంవత్సరంలో ఆకాష్ అనే వ్యక్తితో పెళ్ళైతే 2007 లో విడాకులు తీసుకున్నారు.

కాగా ఈ తర్వాత అదే 2007 లోనే ఆనంద్ జయరాజన్ అనే వ్యక్తితో రెండో పెళ్లి కాగా వీరు 2012లో విడాకులు తీసుకున్నారు. తర్వాత 2020 లో పీటర్ పాల్ అనే వ్యక్తిని ఈమె పెళ్లి చేసుకోగా అదే ఏడాదిలో విడిపోయారు. అప్పుడు నుంచి 2024 వరకు సింగిల్ గానే ఉన్న ఆమె తాజాగా ఓ కొత్త న్యూస్ తో రాబోతున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
దీనితో ఈమె నాలుగో పెళ్ళికి సిద్ధం అయినట్టుగా గట్టి పుకార్లు వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఎంతవరకు నిజం ఉందో మళ్ళీ ఆమె నుంచే క్లారిటీ రావాలని చెప్పాలి. కాగా ఇపుడు ఈమెకు 43 ఏళ్ళు కాగా ప్రస్తుతం తమిళ్ లో "అందగాన్" అనే సినిమాలో పాత్ర చేసారు. ఈ చిత్రం రిలీజ్ కి సిద్ధం అవ్వగా ఇంట్రెస్టింగ్ ఈ సినిమాలో ఈమె ఒక పొసెసివ్ వైఫ్ పాత్రలో కనిపిస్తుందట.


Click it and Unblock the Notifications











