For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్"ఆదిపురుష్ "లో లక్ష్మణుడుగా ఎవరంటే .?

    |

    రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో భారీ సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం డార్లింగ్ రాధాకృష దర్శకత్వంలో 'రాధేశ్యామ్' అనే సినిమా చేస్తున్నాడు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో అందాల భామ పూజాహెగ్డే తో ఆడిపాడనున్నాడు డార్లింగ్. ఈ సినిమా తర్వాత 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేస్తున్నాడు . ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

    ఈ సినిమాలో ఏకంగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే రొమాన్స్ చేయనున్నాడు ప్రభాస్ . సైన్స్ ఫిక్షన్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కబోతుందని సమాచారం . ఇదిలా ఉంటే ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడి తో 'ఆదిపురుష్' అనే సినిమా చేస్తున్నాడు. దశాబ్దాల క్రితం నాటి కథతో దర్శకుడు ఓం రౌత్ ఈ కథను తెరకెక్కించేందుకు సిద్దమయ్యాడు.

    South Star in Prabhas Adipurush as laksman

    ఇక ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ కనిపించనున్నాడు. ప్రభాస్ కు ప్రతినాయకుడిగా అంటే లంకేశ్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు లక్ష్మణ్ గా ఎవరు నటించబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. అయితే ఇందుకోసం దర్శకుడు ఓ సౌత్ యంగ్ హీరోను లాక్ చేసినట్టు తెలుస్తుంది.

    రాముడి తమ్ముడిగా ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్ ఏ హీరోకి దక్కిందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది . ఇక ఈ సినిమా జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. చెడుపై మంచి సాధించిన విజయాన్ని సినిమాగా చూపించబోతున్నాడు దర్శకుడు ఓం రౌత్. ఈ సినిమాకోసం ప్రభాస్ అభిమానులతో పాటు, టాలీవుడ్ -బాలీవుడ్ ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు.

    English summary
    Prabhas has collaborated with filmmaker Om Raut which is titled Adipurush. In this big budget movie, Prabhas will be seen playing the role of Lord Ram, and young South star will be essaying Lord Rama’s brother Laxman’s role in Adipurush.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X