For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎస్సీ బాలు మానస పుత్రిక పాడుతా తీయ‌గా మళ్ళీ మొదలు.. ఈసారి ఆయన ఆధ్వర్యంలో

  |

  ఈరోజు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రథమ జయంతి అనే విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని సినీ సెలబ్రిటీలు ఇతర ప్రముఖులు పంచుకుంటున్నారు. అయితే ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం అభిమానులకు ఒక శుభవార్త లాంటి విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

  ఎంతోమందికి జీవితం

  ఎంతోమందికి జీవితం


  ఇంజనీరింగ్ విద్య మధ్యలోనే ఆపేసి సినిమాల్లో సింగర్ గా మారిన బాలు తన నలభై ఏళ్ల సినీ ప్రయాణంలో దాదాపు కొన్ని వేల పాటలు పాడారు. పాటలు పాడటంతోనే పరిమితం కాక ఆయన నటుడిగా, సంగీత దర్శకుడిగా, హోస్ట్ గా అనేక అవతారాలు ఎత్తి ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపించుకున్నారు. ఆయన గురించి ముఖ్యంగా చెప్పాలంటే పాడుతా తీయగా షో చేసి ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చారు.

   24 సంవత్సరాల పాటు

  24 సంవత్సరాల పాటు

  ఈటీవీ వేదికగా 1996వ సంవత్సరంలో మొదలైన ఈ పాడుతా తీయగా ప్రోగ్రాం దాదాపు 24 సంవత్సరాల పాటు సాగింది. ఇరవై నాలుగు సంవత్సరాలుగా అనేక మంది సింగర్స్ ను ఆయన సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసినట్లయింది.. పాడుతా తీయగా అంటే బాల సుబ్రహ్మణ్యం, బాలసుబ్రహ్మణ్యం అంటే పాడుతా తీయగా అనేంత ప్రేక్షకులకు, సంగీత ప్రియులకు ఈ ప్రోగ్రాం కనెక్ట్ అయిపోయింది.

  తర్జనభర్జనలు

  తర్జనభర్జనలు

  ఈ నేపథ్యంలోనే ఆయన అమితంగా ప్రేమించే ఈ పాడుతా తీయగా ప్రోగ్రాం మళ్లీ అందుబాటులోకి తీసుకరావడానికి ఈటీవీ సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం లాంటి మహామహుడు కూర్చున్న ప్లేస్ లో ఎవరిని కూర్చోబెట్టాలి అనే అంశం మీద కొద్ది రోజుల పాటు తర్జనభర్జనలు జరగగా చివరికి ఆ అంశం మీద కూడా ఒక క్లారిటీ వచ్చిందని అంటున్నారు.

   ఎస్పీ చరణ్ ఆధ్వర్యంలో

  ఎస్పీ చరణ్ ఆధ్వర్యంలో

  తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం స్థానంలో ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ కూర్చోబెట్టాలని రామోజీరావు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే చరణ్ ని పిలిపించుకొని ఆయన మాట్లాడారని చరణ్ కూడా తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. అలాగే ఈసారి చరణ్ కు సహాయం చేయడానికిగానూ మరో ఇద్దరు జడ్జిలను కూడా రామోజీరావు మాట్లాడి ఫైనల్ చేశారని అంటున్నారు.

  అధికారిక ప్రకటన

  అధికారిక ప్రకటన

  ఎస్పీ చరణ్, సునీత, చంద్రబోస్ ముగ్గురు కలిసి రాబోయే పాడుతా తీయగా ఎపిసోడ్స్ లో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఇప్పటికే కొన్ని పైలట్ ఎపిసోడ్స్ షూటింగ్ కూడా జరిగిందని సమాచారం. వీలైనంత త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువరించి, ఎప్పటి నుంచి టెలికాస్ట్ చేసే అంశం కూడా వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు.

  S. P. Balasubrahmanyam Birth Anniversary : మరోసారి పాడవా.. తీయగా ! || Oneindia Telugu
  అలా అయినా సంతోషమే

  అలా అయినా సంతోషమే

  ఇక అదే జరిగితే బాలసుబ్రమణ్యం అభిమానులకు ఒక శుభవార్త అనే చెప్పొచ్చు. బాలసుబ్రమణ్యంని ఎవరూ మరిపించ లేరు కానీ ఆయన మొదలుపెట్టిన కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారని ఆనందమైనా దక్కుతుందని కొందరు అంటున్నారు. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో వేచి చూడాలి మరి.

  English summary
  Padutha Theeyaga is an Telugu-language Reality television singing show that is aired on ETV Telugu. The show used to be hosted by S. P. Balasubrahmanyam, a legendary Playback singer, after his demise reports says that sp charan is going to host it.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X