For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తెలుసా : అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమలో స్పెషల్ ఎట్రాక్షన్

  By Srikanya
  |

  హైదరాబాద్ : ప్రయోగాలు చేయటంలో అల్లు అర్జున్ ముందుంటాడు. కాలం కన్నా ముందు ఉండి తన అభిమానులను అలరించటానికి సై అంటూంటాడు. తాజాగా త్రివిక్రమ్ తో చేస్తున్న చిత్రంలో తన గెటప్ తో ఆశ్చర్యపరిచి, మైమరింపచేయనున్నారని టాలీవుడ్ సమాచారం. ఇందుకోసం కాస్త రీసెర్చి గట్రా అల్లు అర్జున్ చేసాడని చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఏంటా గెటప్ అంటారా.

  బ్రిటీష్ కుర్రాడుగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ కనిపించనున్నాడని తెలుస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా లేటెస్ట్ ట్రెండ్ లను అబ్జర్వ్ చేసిన అల్లు అర్జున్ రీసెంట్ గా ఫొటో షూట్ చేసుకుని బాగుందని ఫిక్సైపోయినట్లు చెప్పుకుంటున్నారు. ఆ లుక్ తో ఫస్ట్ లుక్ వదిలే అవకాసం ఉందని సినీ వర్గాల సమాచారం.

  ఇక కొద్ది రోజుల క్రితం తన స్టైలిష్ట్ అశ్విన్ తో కలిసి దుబాయి షాపింగ్ కు అల్లు అర్జున్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడే ఈ లుక్ కి చెందిన డిజైన్స్ అవీ కొనుక్కోచ్చాడని తెలుస్తోంది.

  Special Attraction in Allu Arjun-Trivikram's Film

  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంతా, ఆదాశర్మ, రాశిఖన్నా హీరోయిన్స్ . ఏప్రిల్‌లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే. జులాయి తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

  కొత్త కథ, కథనాలతో ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుందని నిర్మాత చెబుతున్నారు. ఈ చిత్రంలో స్నేహ, కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు.

  త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆయన చేస్తున్న తాజా చిత్రం షూటింగ్ కోసం ఆయన అక్కడకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ కంటిన్యూగా ఓ పెద్ద షెడ్యూల్ చేయనున్నారు. సమంత, అదా శర్మ, ఉపేంద్ర ఆ షెడ్యూల్ లో పాల్గొననున్నారు.

  ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ చిత్రం కీ సీన్స్ షూటింగ్ జరుగుతోంది. అలాగే ఈ చిత్రంలో ఉపేంద్ర నెగిటివ్ పాత్ర చేస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ పాత్ర నెగిటివ్ కాదని..ప్యారలల్ గా సాగే పాత్ర అని సినిమాలో మరో లీడ్ క్యారెక్టర్ లాంటిదని తెలుస్తోంది. అందుకే ఉపేంద్ర ఒప్పుకున్నాడని తెలుస్తోంది.

  త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ మరోసారి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. చాలా కాలం నుంచి రేపు మాపు అంటూ వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కావటంతో అభిమానుల ఆనందానికి అంతేలేదు.

  ఇదివరకు 'జులాయి'తో సందడి చేసిన ఈ కలయికపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొత్త సినిమాకు చాలా రోజుల క్రితమే కొబ్బరికాయ కొట్టేశారు. వచ్చే నెలలో చిత్రీకరణ అన్నారు. అయితే రకరకాల కారణాలతో వాయిదాపడుతూ వచ్చింది. ఈ లోగా అల్లు అర్జున్ షార్ట్ ఫిలిం, యాడ్స్ అంటూ బిజీ అయ్యారు. ఈలోగా త్రివిక్రమ్ చిత్రం స్క్రిప్టుకు పూర్తి స్ధాయిలో మెరుగులు దిద్దారు.

  ప్రస్తుతం ఉపేంద్ర చేస్తున్న పాత్రకు గానూ...జగపతిబాబు, అర్జున్‌ పేర్లనూ పరిశీలించారు. చివరికి ఉపేంద్రను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇందులో బన్నీ సరసన సమంతతో పాటు ప్రణీత, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తారని సమాచారం. స్నేహ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. కె.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తారు.

  English summary
  For Trivikram's Movie, Allu Arjun would be sporting a 'British' Guy Look which is going to be classy and edgy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X