రామ్ చరణ్ 'ఎవడు'లో ఐటం సాంగ్ "అయ్యో పాపం..."
హైదరాబాద్: రామ్ చరణ్ తేజ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఎవడు'. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఐటం సాంగ్ ల స్పెషలిస్ట్ అయిన దేవి ఈ చిత్రం కోసం కెవ్వు కేక పాటను మించేలా ఐటం సాంగ్ ని స్వరపరిచారని చెప్పుకుంటున్నారు. ఈ పాట ఇలా సాగుతుంది....
"గాజు వాక సెంటర్లో అయ్యో పాపం..."
అయ్యో పాపం... అనేది కెవ్వు కేక లాగ ప్రతీ చరణంలోనూ వస్తుందని, అది ఆడియన్స్ నోళ్లలో నాని పాట మెగా హిట్ అవుతుందని భావిస్తున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి సైతం ఈ పాటను ఓ రేంజిలో చిత్రీకరించాలని సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ పాటకు చేసే ఐటం గర్ల్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లో మగధీరను దాటే చిత్రం అవుతుందని,అన్ని జాగ్రత్తలూ తీసుకుని చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్తున్నారు.
ఈ చిత్రంలో సమంతను లీడ్ హీరోయిన్ గా చేస్తోంది. సమంతతో పాటు సెకండ్ హీరోయిన్‌గా బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్‌ను కూడా ఎంపిక చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్జున్ సరసన కాజల్ గెస్ట్ గా రీసెంట్ గా ఎంపిక చేసారు. ఈ విషయమై దిల్ రాజు మాట్లాడుతూ.. అవును.. కాజల్ మా ఎవడు చిత్రంలో గెస్ట్ పాత్ర చేస్తోంది. ఆమె అల్లు అర్జున్ పాత్రకు పెయిర్ గా కనిపించనుంది.అన్నారు.
రామ్ చరణ్ తేజ్ 'ఎవడు' షూటింగు నిమిత్తం వైజాగ్ వెళ్లి అక్కడో షెడ్యూల్ లో పాల్గొని వచ్చారు. తాజాగా ఆయన వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న నాయిక్ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు.. కంటిన్యూగా'ఎవడు' , బాలీవుడ్ మూవీ జంజీర్ రీమేక్, వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగుల్లో పాల్గొంటూ వస్తున్నాడు. అల్లు అర్జున్,రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. పూర్తి స్ధాయి ఏక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు.


Click it and Unblock the Notifications











