NBK108: బాలయ్య సినిమాలో స్పెషల్ సాంగ్.. ఆ స్టార్ హీరోయిన్‌తోనే!
ఆరు పదుల వయసు వచ్చినా.. కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోనని నిరూపించుకునేలా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు నటిసింహా నందమూరి బాలకృష్ణ. ఇలా ఈ మధ్య కాలంలో 'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్న ఆయన.. ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని ఇప్పుడు అనిల్ రావిపూడితో కలిసి ఓ క్రేజీ మూవీని చేస్తోన్నారు. దీంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తోన్నారు.
నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి కలయికలో వస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈ ఏడాదే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని బ్రేకులు వచ్చినా.. ఇప్పుడు మాత్రం చిత్రీకరణ శరవేగంగానే సాగుతోంది. ఇలా ఇప్పటికే దాదాపు 80 శాతానికి పైగా టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి.. దీన్ని దసరా బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

బాలయ్య సినిమాలో ఎన్నో హైలైట్లు ఉంటాయని అనిల్ రావిపూడి ఇప్పటికే స్వయంగా వెల్లడించాడు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ఓ సూపర్ స్పెషల్ సాంగ్‌ను కూడా పెట్టారని తెలిసింది. ఇందుకోసం ఓ స్టార్ హీరోయిన్‌ను తీసుకోవాలని అనుకున్నారట. ఇలా చాలా మందితో చర్చలు జరిపిన తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను దర్శకుడు అనిల్ ఒప్పించాడని సమాచారం. ఈ పాటను శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తాడని అంటున్నారు. ఈ సాంగ్ సినిమా ప్రీ క్లైమాక్స్‌కు ముందు వస్తుందని, ఆ సమయంలో థియేటర్లు షేక్ అవుతాయని టాక్.

నటసింహా బాలకృష్ణ - అనిల్ రావిపూడి కలయికలో రూపొందుతోన్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. యంగ్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోన్నారు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇది దసరా కానుకగా విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











