పవన్ సినిమా నుంచి క్రేజీ లీక్: మెగా హీరోలు ఒకేసారి.. పూనకాలు ఖాయం
ఇప్పుడున్న పరిస్థితుల్లో టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు ఒక సినిమాను పూర్తి చేయడానికి రెండు మూడేళ్లు సమయం తీసుకుంటున్నారు. అలాంటిది ఒకటి పట్టాలపై ఉండగానే మూడు నాలుగు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ రాకెట్ వేగంతో ప్రాజెక్టులను ఫినీష్ చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే చేతిలో పలు చిత్రాలను పెట్టుకున్న అతడు.. ఒకవైపు రాజకీయాలను చూసుకుంటూనే.. మరోవైపు సినిమా షూటింగ్‌లలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితమే పవన్ 'వినోదయ సీతమ్' రీమేక్‌ను కూడా మొదలు పెట్టిన విషయం తెలిసిందే.
తమిళంలో తెరకెక్కి ZEE5 ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్ అయిన 'వినోదయ సీతమ్' సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించడంతో అందులో పాటు కీలక పాత్రను కూడా పోషించారు. ఇప్పుడిదే సినిమాను పవన్ కల్యాణ్ రీమేక్ చేయబోతున్నాడు. దీనికి కూడా సముద్రఖని డైరెక్షన్ చేస్తుండగా.. ఇందులో మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. దీంతో ఈ మెగా మల్టీస్టారర్ మూవీపై అప్పుడే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ న్యూస్ లీకైంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రాబోతున్న 'వినోదయ సీతమ్' సినిమాకు సంబంధించిన స్క్రిప్టు వర్క్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పూర్తి చేసినట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌ను కూడా పెట్టినట్లు తెలిసింది. ఇందులో ఈ ఇద్దరు మెగా హీరోలతో పాటు ఓ హీరోయిన్ కూడా సందడి చేయనున్నట్లు తెలిసింది. వాస్తవానికి 'వినోదయ సీతమ్' మూవీలో సాంగ్స్ లేవు. కానీ, తెలుగు ఆడియెన్స్ కోసం మాత్రం స్పెషల్ నెంబర్‌ను పెట్టినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ దేవుడి పాత్రను చేస్తున్నట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











