Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఊహించని కానుక.. ఒకేసారి రెండు పండుగలు

టాలీవుడ్‌లో ఇప్పుడున్న ఏ స్టార్ హీరోకూ సాధ్యం కాని రీతిలో వరుసగా హిట్లు మీద హిట్లను సొంతం చేసుకుంటూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు నందమూరి చిన్నోడో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు RRR మూవీతో ప్రపంచం దృష్టిని సైతం ఆకర్షించాడు. ఫలితంగా క్రేజ్ వరల్డ్ వైడ్‌గా పెంచుకున్నాడు. ఈ ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' అనే సినిమాను చేస్తున్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత మార్చిలోనే మొదలు పెట్టారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన ఎన్నో భారీ యాక్షన్ షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. ఇలా ఇప్పటికే ఈ సినిమా కోసం 60 శాతం పైగానే టాకీ పార్టును సైతం ఫినీష్ చేశారు.

Special Surprise From Devara Movie On The Occasion of Diwali

ప్రస్తుతం 'దేవర' సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను గోవాలో జరుపుతున్నారు. ఈ భారీ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌పై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే, ప్రముఖ నటులపైనా కొన్ని సీన్స్ తీశారు. ఇలా మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా జరపాలని యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ న్యూస్ లీకైంది.

ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీ నుంచి ఇప్పటి వరకూ కొన్ని పోస్టర్లు మాత్రమే వచ్చాయి. దీనిపై నందమూరి ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఓ బ్లాస్టింగ్ అప్‌డేట్ రాబోతుందని తెలిసింది. దీపావళి పండుగను సందర్భంగా దీన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్లు తెలిసింది.

ఎన్టీఆర్ 'దేవర' మూవీ నుంచి రాబోయే అప్‌డేట్ ఏంటి అనే దానిపై ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ, ఇది ఎవరూ ఊహించని రీతిలో ఉండబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్‌ సైతం తెగ వైరల్ అవుతోంది.

ఇక, 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. అందులో మొదటి పార్టును 2024 ఏప్రిల్ 5వ తేదీన తీసుకు వస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X