ఫ్యాన్స్ కు పుట్టిన రోజున ఎన్టీఆర్ ...సూపర్ సర్పైజ్ గిఫ్ట్

By Srikanya

హైదరాబాద్ : ఫ్యాన్స్ కు ప్రయారిటీ ఇచ్చి వారిని ఆనందపరచటంలో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటారు. అలాగే ఆయన ఈ సారి తన పుట్టిన రోజుకు కూడా తన అభిమానులు పండుగ చేసుకునే ప్లాన్ చేస్తున్నాడు. మే 20న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఓ ఆశ్చర్యకరమైన బహుమతిని వారికి అందించాలని ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ ఏమిటా గిప్ట్ అంటే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఎన్టీఆర్ తన పుట్టిన రోజున తన వారసుడైన అభయ్ రామ్ ఫోటోలను అధికారికంగా మీడియాకి రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. నాలుగు నెలల క్రితమే ఎన్టీఆర్, ప్రణతి దంపతులకు అభయ్ రామ్ జన్మించారు. ఇప్పటి వరకూ అభయ్ రామ్ కి సంబందించిన ఒక్క ఫోటో కూడా బయటకి రాలేదు. అబిమానులు మాత్రం తమ హీరో వారసుడు ఎలా ఉంటాడో చూడాలని ఆత్రుతగ ఉన్నారు. ఇది గమనించిన ఎన్టీఆర్ ఈ ఏర్పాటు చేసారని తెలుస్తోంది.

కెరీర్ విషయానికి వస్తే...

టెంపర్ తో సక్సెస్ ని అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్న ‘మా నాన్నకు ప్రేమతో' అనే సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఎన్.టి.ఆర్ - సుకుమార్ మూవీని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

ఈ విషయమై సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నా. త్వరలో మొదలయ్యే అవకాశాలున్నాయి. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే సినిమా ఇది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ను హీరోయిన్ అనుకొంటున్నాం. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలందిస్తారు అంటూ చెప్పుకొచ్చారు సుకుమార్.

Special surprise for NTR fans on his b’day

అలాగే...ఎన్టీఆర్...రీసెంట్ గా ...అదుర్స్ సీక్వెల్ ఓకే చేసారని ఫిల్మ్ నగర్ సమాచారం. జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా నయనతార, షీల హీరోయిన్స్‌గా వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అదుర్స్‌' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్‌లోని కామెడీ యాంగిల్‌ను ‘అదుర్స్‌' చిత్రం బయటకు తీసుకు వచ్చింది. అప్పటి వరకు యాక్షన్‌ చిత్రాలకు మాత్రమే పరిమితమయిన ఎన్టీఆర్‌ ‘అదుర్స్‌'తో తాను కూడా కామెడీ చేయగలనంటూ నిరూపించుకున్నాడు. ఆ చిత్రం ఘన విజయం అవ్వడంతో దానికి సీక్వెల్‌ తీసుకు రావాలని ఎన్టీఆర్‌, వినాయక్‌లు చాలా కాలంగా భావిస్తున్నారు.

దీనికోసం వినాయక్ స్ర్కిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారని ఫిలింనగర్ టాక్.కోన వెంకట్, గోపీ మోహన్ ఈ స్క్రిప్టుపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ అయితే ‘అదుర్స్-2'ని చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. అయితే అఖిల్ సినిమాతో వినాయక్ బిజీగా ఉండగా...ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. వీరి ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తవగానే ‘అదుర్స్-2' పట్టాలెక్కనుందని సమాచారం.

మరో ప్రక్క ఈ చిత్రంలో హీరోయిన్స్ సైతం ఫైనల్ అయ్యారని టాక్. ‘అదుర్స్2' చిత్రంలో ఎన్టీఆర్ సరసన అందాల తార నయనతారతో పాటు అందాల ముద్దుగుమ్మ ఆండ్రియాలు నటించనున్నారని ఫిలింనగర్ సమాచారం. అదుర్స్ చిత్రంలో ఎన్టీఆర్, నయనతార జంట అదరగొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా సీక్వెల్‌లో నయనతో పాటు ఆండ్రియా జతయ్యింది.

అయితే... వినాయిక్ ఆ మధ్యన మాట్లాడుతూ... అదుర్స్ చిత్ర కథ ఇంకా ఫైనల్ కాలేదని తెలిపారు. జూ.ఎన్టీఆర్ తో రూపొందించిన 'అదుర్స్' చిత్రానికి సీక్వెల్ గా అదుర్స్-2 నిర్మిస్తున్నారనే వార్తలపై వినాయక్ స్పందించారు. 'కథా చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే ఇంకా ఫైనల్ కాలేదు. ఇంకా చర్చలు కొనసాగుతునే ఉన్నాయి. త్వరలో కథ చర్చలు పూర్తవుతాయి' అని వినాయక్ అన్నారు. అంతేకాకుండా అదుర్స్2 ఎప్పుడు ప్రారంభమవుతుందని ఇప్పడే చెప్పలేమని ఆయన మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.

ఇక ఆ మధ్యన జరిగిన టెంపర్ ఆడియో ఫంక్షన్ లోనూ త్వరలోనే అదుర్స్-2 తెరకెక్కబోతున్నట్టు హింట్ ఇచ్చాడు వినాయక్. అదుర్స్-2 చిత్రానికి సంబంధించి ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయట. ఈ ఏడాది చివర్లో అదుర్స్-2 ఆరంభమవడం ఖాయమనిపిస్తోంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్.. ఏ రేంజిలో అదుర్స్ అనిపిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X