‘గబ్బర్ సింగ్’ చిత్రానికి 14 కోట్ల లాస్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'గబ్బర్ సింగ్' చిత్రం భారీ కలెక్షన్లతో తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొడుతూ దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈచిత్రంపై తాజాగా ఓ గాసిప్ వెలువడుతోంది. గబ్బర్ సింగ్ చిత్రానికి రూ. 14 కోట్ల లాస్ రాబోతోందట. అందుకు ఓ బలమైన కారణం కూడా ప్రచారం జరుగుతోంది.
గబ్బర్ సింగ్ చిత్రంలో 'అంత్యాక్షరి' సీన్ బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. సినిమాలో ఈ సీన్ దాదాపు పావుగంట పాటు సాగుతుంది. ఈ సీన్ కోసం చాలా సినిమాల్లోని సాంగులను ఉపయోగించారు. అయితే తమ పాటలను వాడుకున్నందుకుగాను ఆయా పాటల రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్లు కాపీరైట్ యాక్ట్ ద్వారా తమ వాటా కోరేందుకు సిద్ధం అవుతున్నారని, 100 కోట్ల వసూలు చేసిన ఈ చిత్రంలో 14 శాతం డిమాండ్ చేస్తున్నారని ఓ పుకారు షికారు చేస్తోంది. అయితే నిర్మాత బండ్ల గణేష్ మాత్రం 14 లక్షలు ముట్టజెప్పి సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడట.
పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్స


Click it and Unblock the Notifications











