60 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి సిద్దమైన అమీర్‌ఖాన్? .. ఆమెతో డేటింగ్‌కి ఎండ్‌ కార్డ్?

ఇటీవలికాలంలో సెలబ్రెటీలు ప్రేమలు, పెళ్లిళ్లు, ఎఫైర్లు, విడాకులు అంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఏ బాంబు పేలుస్తారో తెలియక అభిమానులు, సినీ ప్రముఖులు అంతా టెన్షన్ పడుతున్నారు. అభిప్రాయ భేదాలు, వ్యక్తిగత కారణాలతో తమ జీవిత భాగస్వాముల నుంచి విడిపోయిన కొందరు స్టార్స్ తిరిగి కొత్త వ్యక్తిని తమ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ పేరు ఈ లిస్ట్‌లో వినిపిస్తోంది.

భారతీయ చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన అరుదైన నటుల్లో అమీర్‌ఖాన్ కూడా ఒకరు. రొమాన్స్, కామెడీ, యాక్షన్, లవ్ ఇలా ఏ జోనర్ తీసుకున్నా అందులో అద్భుతంగా ఒదిగిపోగల నటుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. పాత్ర కోసం ఎంత కష్టానికైనా అమీర్ సిద్ధమే. దంగల్ సినిమాలో భారీకాయంతో కనిపించినా.. తిరిగి పీకేలో న్యూడ్‌గా కనిపించినా ఆయనకే చెల్లింది. మూడున్నర దశాబ్ధాలుగా బాలీవుడ్‌ను శాసిస్తూ.. ఖాన్ త్రయంలో ఒకరిగా నిలిచారు అమీర్. భారతీయ సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది. ఇవి కాక ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అమీర్‌ఖాన్‌ను వరించాయి.

Speculations on Bollywood super star Aamir Khan s third marriage go viral

దంగల్‌తో బాక్సాఫీస్‌ను వణికించిన ఆయన.. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ హీరోగా నిలిచారు. నేటికీ ఈ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. హీరోగానే కాకుండా అమీర్ ఖాన్ ప్రొడక్షన్ పేరుతో ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. ఆయన నిర్మించిన లాపటా లేడీస్ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కూలీ చిత్రంలో నటిస్తున్న అమీర్ ఖాన్.. సితారే జమీన్ పర్, లాహోర్ 1947 సినిమాలను నిర్మిస్తున్నారు.

అందరితో మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్న అమీర్‌ఖాన్.. వ్యక్తిగత జీవితంలో కొన్ని నిర్ణయాల కారణంగా పలుమార్లు నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. రీనా దత్తాను 1986లో పెళ్లాడారు అమీర్.. ఈ దంపతులకు ఐరా ఖాన్, జునైద్ ఖాన్ సంతానం. అమీర్ స్టార్ హీరోగా ఎదగడంతో పాటు సంతోషంగా జీవితం సాగుతున్న దశలో పెళ్లయిన 16 ఏళ్లకు ఈ జంట విడాకులు తీసుకుని షాకిచ్చింది.

రీనా దత్తాతో విడాకులు తర్వాత లగాన్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించిన కిరణ్ రావుతో ప్రేమలో పడిన అమీర్‌ఖాన్ కొన్నాళ్లు డేటింగ్ చేశాక 2005లో వివాహబంధంలో అడుగుపెట్టారు. ఈ జంట సరోగసి విధానంలో ఆజాద్ అనే బాబుకి జన్మనిచ్చారు. కిరణ్ నిర్మాణం, దర్శకత్వ బాధ్యతలతో ఉంటూనే ఫ్యామిలీతో సంతోషంగా గడిపేవారు. అలా సాఫీగా సాగుతున్న దశలో కిరణ్ రావు - అమీర్ ఖాన్ దంపతులు విడాకులు తీసుకుని మరోసారి షాకిచ్చారు.

నాటి నుంచి అమీర్ మూడో పెళ్లి చేసుకోబోతున్నారని.. దంగల్‌ ఫేమ్ ఫాతిమా సనా షేక్‌తో ప్రేమాయణం సాగిస్తున్నారని రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ మహిళతో డేటింగ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తాను మూడు పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమీర్ వ్యాఖ్యానించడం కూడా ఈ పుకార్లకు ప్రాధాన్యత చేకూరుస్తున్నాయి. అయితే ఇది గాలివార్తా? లేక అమీర్ ఖాన్ నిజంగానే మూడోసారి పెళ్లి కుమారుడు కానున్నారా? అన్నది త్వరలోనే తేలనుంది.

More from Filmibeat

Read more about: bollywood aamir khan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X