ఆమె హాట్ ఫోటోలు లీక్ చేసింది దిల్ రాజే అంటూ ప్రచారం?
హైదరాబాద్ : శృతిహాసన్ ఇప్పుడు మండిపడుతోంది. తన అనుమతి లేకుండా తమ ఫోటోలను ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసిన వారిపై కేసులు పెడతానని అంటోంది. ఎవడు చిత్రంలోని పింపుల్ డింపుల్ సాంగ్ చేస్తున్నడు తీసిన కొన్ని చిత్రాలను అప్ లోడ్ చేసారు. డాన్స్ చేస్తున్నప్పుడు టాప్ యాంగిల్ లో తీసిన ఆ ఫోటోలు అసభ్యంగా ఉన్నాయి. అలాంటివాటిని డిలీట్ చేసేస్తూంటారని, అయినా బయిటకు ఎలా వచ్చాయో అర్దం కావటం లేదని అంటోంది. ఈ ఫోటోలు బయిటకు రావటంతో ఆమె బరితెగించి రెచ్చిపోయిదంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ కథనాలు ఆమెను చాలా బాధపెట్టాయి.
శృతి మాట్లాడుతూ... నన్ను చాలా మంది అడుగుతున్నారు..అలాంటి అసభ్యకరమైన ఫోజ్ ఎందుకు ఇచ్చావంటూ... వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్దం కావటంలేదు. నిజం ఏమిటంటే ఇలాంటి చీప్ పబ్లిసిటీ కోసం నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఇలాంటివి జరుగుతాయని నేను ఊహించలేదు. అలాగే నేను హైదరాబాద్ లో ఈ విషయమై ఎఫ్ ఐ ఆర్ నమోదు చెయ్యబోతున్నాను అని తేల్చి చెప్పింది. అలాగే తాను ఈ ఇష్యూలో ఎంతదాకా అయినా వెళ్తానని, ఎలాగయినా ఈ ఫొటోలు అప్ లోడ్ చేసిందెవరో తెలుసుకుంటానని చెప్పింది. ఇది నమ్మకానికి సంభందించిన సమస్య అని ఆమె వ్యాఖ్యానించారు.

కాగా....ఈ ఫోటోలు లీక్ అవ్వడం వెనక 'ఎవడు' చిత్ర నిర్మాత దిల్ రాజు హస్తం ఉందనే గుసగుసలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. ఇలాంటి ఫోటోలు నిర్మాత ఆధీనంలోనే ఉంటాయని, ఆయనే వాటిని వెబ్ సైట్లకు విడుదల చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఇందులో నిజానిజాలు తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











