ప్రభాస్ కు సందీప్ రెడ్డివంగ ఫస్ట్ కండీషన్.? ‘స్పిరిట్’ కోసం స్పెషల్ కేర్!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'బాహుబలి' తర్వాత నుంచి డార్లింగ్ భారీస్కేల్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఒక్కో ప్రాజెక్ట్ బడ్జెట్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతోంది. మరోవైపు ఆ రేంజ్ లోనే డార్లింగ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ప్రభాస్ చివరిగా 'కల్కి 2898 ఏడీ' చిత్రంతో రూ.1100 కోట్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఆ ముందు 'సలార్'తో మాస్ యాక్షన్ ట్రీట్ అందించి ఫ్యాన్స్ ను ఖుషి చేశారు. మరోవైపు నెక్ట్స్ ప్రభాస్ నుంచి రాబోయే చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఒక్కొక్క మూవీ షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసే పనిలో డార్లింగ్ నిమగ్నమై ఉన్నారు.
అయితే ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రాల్లో సెన్సేషనల్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చిత్రమొకటి ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇప్పటికే 'స్పిరిట్' అనే క్రేజీ టైటిల్ ను కూడా ప్రకటించి ఆడియెన్స్ లో ఆత్రుత పెంచేశారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో తెరకెక్కించబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'స్పిరిట్' పైనే ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం నటీనటులు, టెక్నిషీయన్ల ఎంపికను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రభాస్ ను కూడా తను చూపించనబోతున్న పాత్రకు అనుగుణంగా మార్చుకుంటున్నారు.

ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కు ఓ కండీషన్ పెట్టినట్టు తెలుస్తోంది. షూట్ స్టార్ట్ అయితే మాత్రం బయట కనిపించడానికి వీల్లేదని చెప్పారంట. మొదటి షెడ్యూల్ నుంచి చివరి షెడ్యూల్ వరకు తను తెరకెక్కించబోతున్న పాత్ర తాలుకూ లుక్ ఏమాత్రం రివీల్ కావడానికి వీల్లేదని ప్రభాస్ కు షరతులు పెట్టారంటన్నారు. అందుకు డార్లింగ్ కూడా ఓకే అని చెప్పారంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. అయితే డార్లింగ్ నుంచి నెక్ట్స్ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ విడుదల కావాల్సి ఉన్న తరుణంలో సందీప్ రెడ్డి వంగ ఇలాంటి షరతులు పెట్టారనే వార్తలు ఆసక్తికరంగా మారాయి.
ప్రభాస్ ఇప్పటికే డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో 'రాజా సాబ్', హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం. ఇంకా రిలీజ్ డేట్ ను ఖరారు చేయాల్సి ఉంది. ముందుగా 'రాజా సాబ్' విడుదల కానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ప్రభాస్ బయటికి వస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి. తన సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ కనిపించకపోతే ఫ్యాన్స్ ఏమాత్రం ఒప్పుకోరు. ఆ లెక్కన ప్రభాస్ బయటికి వచ్చే ఛాన్స్ ఉంటే... ఈ చిత్రాల తర్వాతనే ప్రభాస్ 'స్పిరిట్' సెట్స్ లో అడుగుపెడుతారని పలువురు సినీ పండితులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు ఇప్పటికే ప్రభాస్ 'స్పిరిట్' కోసం స్పెషల్ డైట్ ను ఫాలో అవుతున్నారంట. మళ్లీ జిమ్ లో ప్రత్యేక వర్కౌట్స్ చేస్తూ ఉన్నారని తెలుస్తోంది. ఇక సందీప్ రెడ్డి వంగ డార్లింగ్ ను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతుండటం విశేషం. అలాగే ప్రభాస్ తో షర్ట్ లెస్ గా ఓ సాలిడ్ యాక్షన్ సీన్ ను కూడా చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంపై మున్ముందు ఎలాంటి అప్డేట్స్ అందుతాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











