Spirit : స్పిరిట్ మూవీకి కళ్లు చెదిరే బిజినెస్.. డిజిటల్ రైట్స్ కు ఎన్ని కోట్లంటే?

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న మూవీ స్పిరిట్ ( Spirit). మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా ఈ భారీ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమం ఇటీవల జరిగింది. ఈ సినిమా యాక్షన్-ఎమోషన్‌ మేళవింపుతో పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ మూవీ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తం సినిమా లవర్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్ తో పాటు సందీప్ వంగా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా స్పిరిట్ మూవీకి సంబంధించిన ఓటీటీ డీల్ జరిగినట్టు తెలుస్తోంది. ఇంతకీ ప్రభాస్ మూవీ డిజిటల్ రైట్స్ కు ఎన్ని కోట్లంటే?

ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వీరిద్దరి కలయికలోనే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాలలో దీనిపై నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీ నెలకొంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో త్రుప్తి దిమ్రి, వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకే కాదు, ప్రపంచవ్యాప్త ఫ్యాన్ బేస్‌ను దృష్టిలో పెట్టుకుని, ఐదు ప్రధాన భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ప్రయత్నం జరుగుతోంది.

Spirit Movie Digital Rights Deal Prabhas-Sandeep Reddy Vanga Film Creates Record-Level Business

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా చెప్పావల్సిన అవసరం లేదు. 'స్పిరిట్'లో ప్రభాస్ పూర్తి విభిన్నంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ తన కెరీర్‌లో మొదటిసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని ఇండస్ట్రీ టాక్. ఈ క్యారెక్టర్ కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రత్యేకంగా రూపొందించిన కథనం రాసుకున్నట్టు తెలుస్తోంది. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌ తో పాటు ఎమోషన్‌లను కూడా హైలైట్ చేసే విధంగా స్టోరీ డిజైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సంగీత బాధ్యతలు 'యానిమల్' ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ చేపట్టడం కూడా యాక్షన్-ఎమోషన్ ఫ్యూజన్‌కు మరింత బలం చేకూరింది.

తాజాగా స్పిరిట్ సినిమా డిజిటల్ హక్కులకు సంబంధించిన వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. స్పిరిట్ డిజిటల్ రైట్స్ ఏకంగా రూ. 160 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఈ భారీ మొత్తం ప్రభాస్ మార్కెట్ రేంజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. బాహుబలి తర్వాత వరుసగా పాన్-ఇండియా ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ప్రభాస్.. డిజిటల్ హక్కుల విషయంలోనూ తన సత్తాను చాటారు అనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ ప్రస్తుతం ఎంచుకుంటున్న ప్రతి ప్రాజెక్ట్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటూ, బాక్సాఫీస్‌ను షేక్ చేసే విధంగా సిద్ధమవుతున్నాయి. ఆయన రేంజ్ సినిమా సినిమాకు పెరుగుతుండటంతో, ఫ్యాన్స్ కూడా ప్రభాస్ మరిన్ని అద్భుతమైన రికార్డులను తన ఖాతాలో వేసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే 'స్పిరిట్' ప్రభాస్ కెరీర్‌లో మైలురాయిగా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2027 సంవత్సరంలో థియేటర్లలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ , సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X