ప్రభాస్ సినిమాలో విజయ్ దేవరకొండ.. సందీప్ రెడ్డి వంగా హింట్ ఇదేనా?
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ బ్రాండ్‌గా మారిన సంగతి తెలిసిందే. కేవలం మూడు చిత్రాలతోనే పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రూపొందిస్తున్న భారీ సినిమా స్పిరిట్ (Spirit). ఈ మూవీపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన రకరకాల రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, తాజాగా ఓ వార్త మాత్రం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఇంతకీ ఆ మ్యాటరేంటీ?
అదేంటంటే... ప్రభాస్ స్పిరిట్ మూవీలో విజయ్ దేవరకొండ క్యామియో పాత్రలో కనిపించబోతున్నారన్న ప్రచారం. సినీ ఇండస్ట్రీలో పదుల సంఖ్యలో సినిమాలు చేస్తేనే గుర్తింపు వస్తుందన్న సంప్రదాయాన్ని పక్కనపెట్టి, తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగా ఒకరు. విజయ్ దేవరకొండను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన అర్జున్ రెడ్డి బాక్సాఫీస్ వద్ద సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు.

పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా, హీరో పాత్రల రూపకల్పనలో సందీప్ రెడ్డి ప్రత్యేకతను చాటింది. ఆ తర్వాత అదే సినిమాను బాలీవుడ్‌లో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. అనంతరం రణబీర్ కపూర్ తో తెరకెక్కించిన యానిమల్ ఆయనను పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్‌గా నిలబెట్టింది.
ఇప్పుడు అదే క్రియేటివ్ డైరెక్టర్ నుంచి రాబోతున్న భారీ ప్రాజెక్ట్ 'స్పిరిట్'. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌తో, ఇంటెన్స్ యాక్షన్, డార్క్ ఎమోషనల్ డ్రామా కలబోతగా ఈ సినిమా రూపొందుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ కెరీర్‌లో ఇప్పటివరకు కనిపించని కొత్త షేడ్‌లో, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో ఈ సినిమాలో ఆయన కనిపించనున్నారని టాక్. సందీప్ రెడ్డి స్టైల్‌కు తగ్గట్టుగా క్యారెక్టర్ డెప్త్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ కూడా భారీగా ఉండటంతో అంచనాలు మరింత పెరిగాయి.
ప్రభాస్ సరసన త్రిప్తి దిమ్రి కథానాయికగా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్, డాన్ లీ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారట. ఇప్పటికే విడుదలైన ఆడియో టీజర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో మరో ఆసక్తికర ప్రచారం ఊపందుకుంది. 'స్పిరిట్' సినిమాలో విజయ్ దేవరకొండ క్యామియో పాత్రలో కనిపించనున్నారన్న వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
దీనికి కారణం... ఇటీవల విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డిని కలవడం, అలాగే 'అర్జున్ రెడ్డి' షూటింగ్ సమయంలో తీసుకున్న పాత ఫోటోను సందీప్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేయడం. దీంతో అభిమానులు ఇది కేవలం నాస్టాల్జియా కాదు... స్పిరిట్‌లో విజయ్ క్యామియోకు హింట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై మూవీ మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అందువల్ల దీనిని ప్రస్తుతం రూమర్‌గా మాత్రమే పరిగణించాల్సి వస్తోంది.
ఇదే సమయంలో ఈ సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్రలో చిరంజీవి నటించనున్నారన్న వార్తలు కూడా గతంలో వినిపించాయి. కానీ ఆ రూమర్లను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే ఖండించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, విలన్ పాత్రకు సంబంధించి కూడా పలు పేర్లు ప్రచారంలోకి వచ్చినా, వాటిపై అధికారిక స్పష్టత లేదు. ఇలా అధికారిక అప్‌డేట్స్‌కు మించి 'స్పిరిట్' సినిమాపై రూమర్లు ఎక్కువగానే వినిపిస్తున్నాయి.సినిమాపై హైప్స్ క్రియేట్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











