»   » పవన్ పార్టీ: మెగా ఫ్యాన్స్‌లో సైతం చీలిక, భవిష్యత్ గందరగోళం!

పవన్ పార్టీ: మెగా ఫ్యాన్స్‌లో సైతం చీలిక, భవిష్యత్ గందరగోళం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ నిర్ణయం....మెగా కుటుంబంలో మాత్రమే కాదు, మెగా అభిమాన సంఘాల్లో కూడా చీలికకు కారణమవుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో కొందరు అభిమానులు చిరంజీవి, రామ్ చరణ్‌లకు మద్దతుగా ప్రకటించగా....గత కొంతకాలంగా పవనిజం పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారంతా పవన్ కళ్యాణ్‌కు సపోర్టుగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మొదటి నుండి అభిమానులు సంబంధించిన వ్యవహారాలన్నీ మెగా బ్రదర్ నాగబాబు దగ్గరుండి చూసుకుంటున్న సంగతి తెలిసిందే. నాగ బాబు తనకు ఉన్న పరిచయాలతో వీలైనంత మందిని పవన్ కళ్యాణ్ పార్టీకి వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే చిరంజీవితో డైరెక్టుగా సంబంధాలు ఉండే అభిమానులు మాత్రం.....మరో గ్రూపుగా ఉంటారని తెలుస్తోంది.

Splits cracking among Mega fans!

రాష్ట్రంలో ఇప్పటికే వివిధ కుటుంబాలకు చెందిన స్టార్ హీరోల అభిమానుల మధ్య ఎలాంటి పరిస్థితి ఉందో తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకే కుటుంబానికి అభిమానులుగా ఉన్న వారు రెండుగా చీలిపోతే భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు నెలకొంటాయో? అనే అంశం సర్వత్రా చర్చనీయాంశం అయింది. మెగా అభిమానుల్లో చీలిక మెగా కుటుంబం నుండి వచ్చే సినిమాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు.

పవన్ పార్టీ విషయానికొస్తే...
పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం ఖాయమైందనే విషయాన్ని ధ్రువీకరిస్తూ హైదరాబాదులోని హైటెక్స్‌లో పవన్ కళ్యాణ్ పేర ఓ హాల్ బుక్కయినట్లు సమాచారం. హైటెక్స్ వేదికగా ఈ నెల 14వ తేదీ సాయంత్రం పవన్ కళ్యాణ్ తాను స్థాపించబోయే పార్టీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ అనుచరులతో పాటు పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్త హాజరవుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 45 నిమిషాల పాటు ఆయన ప్రసంగించే అవకాశాలున్నాయి. ఆ తర్వాత తాను రాజకీయాలపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.

పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరంగేట్రానికి సోదరుడు, సినీ నటుడు నాగబాబు మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. తెర వెనక వ్యహారమంతా సినీ దర్శకుడు త్రివిక్రమ్ చూస్తున్నట్లు వినికిడి. గతంలో పరుచూరి బ్రదర్స్, త్రిపురనేని మహారథి ఇటువంటి పనులు చేసేవారు. అదిరిపోయే, పంచ్ పొలిటికల్ డైలాగులు తయారు చేసి పెట్టేవారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు త్రివిక్రమ్ ఆ పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాల వెనక ప్రముఖ 'పివిపి సినిమా' సంస్థ అధినే ప్రసాద్ వి. పొట్లూరి మద్దతుగా ఉంటున్నారని టాక్. పవన్ పార్టీ తరుపున ఆయన భవిష్యత్తులో విజయవాడ నుండి పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా ఆయన పవన్ పార్టీ రాజకీయ కార్యక్రమాలకు ఫైనాన్సియల్‌గా సపోర్టుగా నిలుస్తారని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.

English summary
This seems to have cleared the air about differences in the mega family members especially the brothers and exposed the deeply widened cracks between the two brothers Chiranjeevi and Pawan Kalyan. Mega fans also in the same way.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu