మహేష్ విషయంలో అవన్నీ రూమర్సే.. అసలు విషయం ఇదీ అంటూ మరో అప్‌డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి జోష్‌లో ఉన్నారు. ఇటీవలే భరత్ అనే నేను సినిమాతో భారీ విజయం తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో తాజాగా తన 25 వ సినిమా మహర్షి మరో హిట్ సొంతం చేసుకున్నారు. మే 9 న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లో చేరిపోవడం విశేషం. మహేష్ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ మూవీగా వచ్చిన ఈ సినిమా అంచనాలను మించి వసూళ్లు రాబడుతోంది. ఈ సక్సెస్‌తో ఖుషీ ఖుషీగా ఉన్న మహేష్ అభిమానులు ఇక ఆయన 26 వ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
మహేష్ కెరీర్‌లో మహర్షి తర్వాత రాబోతున్న కొత్త సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే మహేష్ అనిల్ రావిపూడి మూవీ సెట్స్ పైకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారని వార్తలు వచ్చాయి. దూకుడు తరహాలోనే ఇది కూడా ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని చెప్పుకొచ్చారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు అనిల్ రావిపూడి చిత్రంలో మహేష్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయడం లేదని, ఈ విషయమై ఇప్పటి వరకూ వచ్చిన వార్తలన్నీ రూమర్సే అని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఇందులో మహేష్ చేయబోయే క్యారెక్టర్ ఏంటనే విషయంపై కొత్త ఉత్సాహం నెలకొంది ఆయన అభిమానుల్లో. మొత్తానికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ మహేష్‌కి హాట్రిక్ మూవీ కావడంతో ప్రేక్షకులు భారీగా అంచానాలు పెట్టుకున్నారు.
మరోవైపు ఇటీవలే వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో ఎఫ్ 2 మూవీ చేసి మంచి జోష్ లో ఉన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. కాబట్టి అదే జోష్ మహేష్‌కి హాట్రిక్ ఇస్తాడనే కాన్ఫిడెన్స్ అందరిలో ఉంది. చూడాలి మరి అనిల్ ఏ మేరకు కృషి చేస్తాడో. ఇంకా ఈ సినిమా టైటిల్, హీరోయిన్స్, నటీనటుల విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.


Click it and Unblock the Notifications











