twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘స్పైడర్’పై తప్పుడు లెక్కలు, ప్లాప్ ప్రచారం... నిర్మాతలు లీగల్‌గా?

    స్పైడర్ సినిమా నిర్మాతలు ఇష్యూ హాట్ టాపిక్ అయింది. సినిమాను తప్పుగా ప్రమోట్ చేసిన వారిపై చర్యకు సిద్ధం.

    By Bojja Kumar
    |

    Recommended Video

    Legal Attacks For Calling Spyder Is A Flop ‘స్పైడర్’ నిర్మాతలు లీగల్‌ యాక్షన్

    ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో విమర్శలను సహించలేని తనం ఎక్కువవుతోంది. సినిమాపై తమ అభిప్రాయాలను వెల్లడించే రివ్యూ రైటర్లపై పలువురు హీరోలు బహిరంగంగా నోరు పారేసుకుంటున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్లో మాత్రమే కాదు... ఇతర సినిమా పరిశ్రమల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొని ఉంది.

    ఆ సంగతి పక్కన పెడితే 'స్పైడర్' సినిమా విషయంలో తప్పుడు లెక్కలు ప్రచారంలోకి తెచ్చి, సినిమాను ప్లాప్ అని ప్రచారం చేసిన బాక్సాఫీసు ఎనలిస్టు మీద స్పైడర్ టీం లీగల్ యాక్షన్ కు సిద్ధమవుతున్నట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం మొదలైంది. అయితే ఈ విషయం అఫీషియల్ గా మాత్రం ఖరారు కాలేదు.

    ఏం జరిగింది?

    ఏం జరిగింది?

    ప్రముఖ బాక్సాఫీసు ఎనలిస్టు ఒకరు ‘స్పైడర్' సినిమా విడుదలైన తర్వాత వారం రోజుల కలెక్షన్లు ప్రకటించి, సినిమా ప్లాప్ అంటూ డిక్లేర్ చేశారట. అయితే అతడు చూపుతున్న లెక్కలు తప్పు, మా సినిమాపై తప్పుడు ప్రచారం చేస్తున్నడంటూ.... అతడిపై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నట్లు ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.

    కలెక్షన్ల విషయంలో ఏది నిజం?

    కలెక్షన్ల విషయంలో ఏది నిజం?

    సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్ల విషయంలో నిర్మాతలు ప్రదర్శించే గిమ్మిక్స్ అన్నీ ఇన్నీ కావు. నంబర్స్ మాయాజాలం ప్రదర్శిస్తూ వారు చేస్తున్న ప్రకటనలు కొన్ని సార్లు ప్రేక్షకులను కూడా అయోమయంలోకి నెట్టి వేస్తుంటాయి. ఓ వైపు సినిమా ఇన్ని వందల కోట్లు వసూలూ చేసిందంటారు. ఇండస్ట్రీలో ఇదే టాప్ కలెక్షన్ అంటారు. కట్ చేస్తే ఆ సినిమా చివరకు నష్టాలతో ముగుస్తుంది.

    ఇక్కడ అలా, అక్కడ మరోలా...

    ఇక్కడ అలా, అక్కడ మరోలా...

    సినిమా కలెక్షన్లు ఇంత అంటూ నిర్మాతలు ప్రకటించే దానికి, వారు ఇన్ కం టాక్స్ డిపార్టుమెంటుకు చూపించే లెక్కలకు అసలు పొంతనే ఉండదనే వాదన కూడా ఉంది. గతంలో కొందరు నిర్మాతలు సినిమా లాభాలు వచ్చిందని ప్రచారం చేసుకోవడం, ఇన్ కం టాక్స్ వారికి నష్టాల పద్దులు చూపిన సందర్భాలు కూడా ఉన్నాయని కొందరు అంటుంటారు.

    పోటా పోటీగా ప్రకటనలు

    పోటా పోటీగా ప్రకటనలు

    ఏమైనా ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు పోటా పోటీగా ఒకే సీజన్లో విడుదలైనపుడు తమ హీరో సినిమా గొప్పగా ఆడుతుందంటే... తమ హీరో సినిమా గొప్పగా ఆడుతుంది అన ప్రెస్ మీట్లు పెట్టి మరీ ప్రకటనలు చేయడం గతంలో చాలా సందర్భాల్లో చూశాం.

    పారదర్శకమైన వ్యవస్థ ఉండాలి

    పారదర్శకమైన వ్యవస్థ ఉండాలి

    సినిమా కలెక్షన్ల విషయంలో ఒక పారదర్శకమైన వ్యవస్థ ఉండాలని, సినిమా ఎంత పెట్టుబడితో తీశారు, ఎంత వసూలు చేసింది, ఎంత నష్టపోయింది, ఎంత లాభ పడింది అనే విషయాలు తెలుసుకునేలా ఒక వ్యవస్థ ఉంటే బావుంటుంది సామాన్య ప్రేక్షకుడి అభిప్రాయం.

    అప్పుడే గవర్నమెంటుకు సరైన టాక్స్ చేరుతుంది

    అప్పుడే గవర్నమెంటుకు సరైన టాక్స్ చేరుతుంది

    సినిమాల కలెక్షన్ల విషయంలో ఒక పారదర్శకమైన వ్యవస్థ ఉంటే గవర్నమెంటుకు కూడా చేరాల్సిన టాక్స్ సక్రమంగా చేరుతుందని, ఇలాంటి వ్యవస్థ ఒకటి ఉంటే బావుంటుందని అంటున్నారు.

    English summary
    The buzz in Film Nagar circles is saying that some people from "Spyder" team are not even hesitating to take a legal attack if someone calls the film a flop. A popular box-office tracker has sometime back pronounced the figures made by this Mahesh starrer in a week time and declared that the film is a flop.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X