twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఎస్ ఆర్ మూవీస్’ సినిమా వాళ్ళకు శుభవార్త

    By Staff
    |

    మలేషియాలో షూటింగ్ చేయాలనుకునే వారి కోసం అక్కడే 10 సంవత్సరాల నుండి స్థిరనివాసం ఏర్పరచుకున్న పి.శ్రీనివాస్ అనే తెలుగు యువకుడు కొత్తగా ఎస్.ఆర్.మూవీస్ అనే సంస్థను స్థాపించారు. ఆ విశేషాలను ప్రసాద్ ల్యాబ్స్ లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీనివాస్ తెలిపారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు, ప్రభాస్, కె.ఎస్.రామారావు, మెహర్ రమేష్, సాగర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ సంస్థ ష్యూటింగ్ పర్మింట్ ను, లొకేషన్ సర్చ్, అవుట్ డోర్ యూనిట్ సౌకర్యం, నెగటివ్ స్టాక్, లాబ్ ప్రొసెసింగ్, ఫుడ్ మరియు అకామిడేషన్, ట్రాన్స్ పోర్టేషన్, మొదలైనవన్నీ అమర్చుతాయన్నారు.

    మొదట కృష్ణంరాజు మాట్లాడుతూ, 'బిల్లా' చిత్రం షూటింగ్ కోసం మలేసియా వెళ్లినప్పుడు అక్కడ రావ్ అనే కో-ఆర్టినేటర్ ను సంప్రదించామనీ, అయితే అతని వల్ల షూటింగ్ సజావుగా సాగక పలు ఇబ్బందులు ఎదుర్కొన్నామనీ అన్నారు. ఇదే సమయంలో మలేషియాలో ఉన్న తమ ఊరివాడైన శ్రీనివాస్ తనను పరిచయం చేసుకుని షూటింగ్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహకరించాడనీ, అతని పని తీరు నచ్చి ఓ సంస్థను ఏర్పాటు చేయమని సూచించినట్టు చెప్పారు. ఆ విధంగానే ఎస్.ఆర్.మూవీస్ సంస్థను ఆయన స్థాపించాడనీ, మన తెలుగువాళ్ల షూటింగ్ లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయన కో-ఆర్డినేట్ చేస్తాడని తెలిపారు. మలేషియాలో షూటింగ్ ముచ్చటను 'బిల్లా' దర్శకుడు మెహర్ రమేష్ ముచ్చటిస్తూ, అక్కడ షూటింగ్ మొదలుపెట్టినప్పుడు నాలుగు రోజుల పాటు డబ్బులు మంచినీళ్లలా ఖర్చయ్యాయనీ, శ్రీనివాస్ ను కలిసిన తర్వాత ఇబ్బందులే లేవనీ చెప్పారు. ఉచితంగా కూడా కొన్ని లొకేషన్లు ఇప్పించారని తెలిపారు. ఎస్.ఆర్.మూవీస్ సంస్థ దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని అన్నారు. మొదట్లో సినిమా షూటింగ్ లు చూడటానికి తాను వెళ్లేవాడిననీ, అప్పుడు వారి కష్టనష్టాలు అవగాహన చేసుకున్న తర్వాతే ఎస్.ఆర్.మూవీస్ ను స్థాపించినట్టు శ్రీనివాస్ తెలిపారు. కేవలం డబ్బు కోసం కాకుండా సినిమాల పట్ల ఉన్న మమకారంతో ఈ పని చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X