ఆ స్టార్ సింగర్ భర్తతో విడిపోయిందా? గొడవలతో బతకలేమంటూ షాకింగ్ పోస్ట్
ప్రస్తుతం ఇండియాలో సెలబ్రెటీలు ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకుంటూ అభిమానులకు షాకులిస్తున్నారు. ఎప్పుడు ఏ స్టార్ బ్రేకప్ అంటాడో, విడాకులు అంటూ బాంబు పిలుస్తాడో అర్ధం కావడం లేదు. కొందరు ఏళ్లుగా తమ జీవిత భాగస్వామితో విడిపోయినా ఆ విషయంపై నోరెత్తడం లేదు. ఒక్కసారిగా ఓపెన్ అవుతూ కలకలం రేపుతున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ సింగర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
పెద్దల అంగీకారంతో పెళ్లి
టాలీవుడ్‌లో స్టార్ సింగర్స్‌గా వెలుగొందుతున్నారు శ్రావణ భార్గవి - హేమచంద్ర. తెలుగునాట టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితోనూ ఈ జంట కలిసి పనిచేసింది. తొలుత 92.7 బిగ్ ఎఫ్ఎంలో పనిచేసిన శ్రావణ భార్గవి.. 2009లో బిల్లా మూవీలో బొమ్మాళి సాంగ్‌తో యూత్‌ను ఊపేశారు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో ఒక ఊపు ఊపారు. ఇక తన స్నేహితుడు, మరో సింగర్ హేమచంద్రతో ప్రేమలో పడిన శ్రావణ భార్గవి 2013లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు శిఖ చంద్రిక అనే ఒక కుమార్తె ఉంది.

జంటగా హోస్టింగ్
పెళ్లయ్యాక టాలీవుడ్‌లోని స్టార్ కపుల్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న హేమచంద్ర - శ్రావణ భార్గవిలు కలిసి పాటలు పాడటం, బుల్లితెరపై కొన్ని షోలు హోస్ట్ చేయడం వంటి కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించారు. అంతా సజావుగా సాగుతున్న దశలో హేమచంద్ర - శ్రావణ భార్గవిలు విడిపోయారంటూ గాసిప్స్ రావడం కలకలం రేపింది. అయితే ఈ వార్తలలో నిజం లేదని వారిద్దరూ ఖండించారు కూడా. కానీ ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించకపోవడం, కలిసి ప్రోగ్రామ్స్ చేయకపోవడం చర్చనీయాంశమైంది. అంతేకాదు.. హేమచంద్రకు సంబంధించిన ఫోటోలను శ్రావణ భార్గవి తొలగించడంతో వీరిమధ్య ఏదో జరుగుతోందని అనుమానాలు మొదలయ్యాయి.
శ్రావణ భార్గవి- హేమచంద్ర విడిపోయారా?
శ్రావణ భార్గవి మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే గతేడాది కూతురితో కలిసి ఉన్న ఫోటోను శ్రావణ భార్గవి షేర్ చేశారు.. ఇందులో హేమచంద్ర లేకపోవడం వీరి విడాకుల వార్తలకు మరిం బలాన్ని చేకూర్చింది. కూతురు, కెరీర్‌పై ఫోకస్ పెట్టిన శ్రావణ భార్గవి.. తన ఆల్బమ్స్‌తో దుమ్ములేపుతున్నారు. ఈ ఏడాది శంకర్- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజర్‌లో కొండ దేవర సాంగ్‌తో పలకరించారు శ్రావణ భార్గవి. ఇంత జరుగుతున్నా శ్రావణ భార్గవి- హేమచంద్ర కలిసే ఉన్నారా? విడిపోయారా? అన్నది మాత్రం క్లారిటీ రాలేదు.
అపార్ధాలతో బతకొద్దంటూ పోస్ట్
తాజాగా శ్రావణ భార్గవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ కలకలం రేపుతోంది. లైఫ్ చాలా సున్నితమైనది.. అవసరాలు, అపార్ధాలు, చిక్కుముళ్లు, వివాదాలు, గొడవలు.. వీటితోనే బతికేయడంలో అర్ధం లేదన్నారు. ప్రేమ మాత్రమే అర్ధవంతమైనది.. మనం ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు ..వారిని ఎక్కువగా ప్రేమించడానికే చూడాలి.. జీవితంలో మనం గెలిచామో? ఓడామో అదే డిసైడ్ చేస్తుందని శ్రావణ భార్గవి రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా .. ఇది తన భర్త హేమచంద్రను ఉద్దేశించే శ్రావణ భార్గవి పోస్ట్ చేశారా? భర్తగా విడిగా ఉంటున్న విషయంపై హింట్ ఇచ్చారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











