శ్రీకారం డిజిటల్ రిలీజ్.. జెట్ స్పీడ్ లో రాబోతున్న శర్వానంద్
చాలా కాలంగా సక్సెస్ లేక సతమతమవుతున్న హీరోల్లో శర్వానంద్ ఒకరు. మహానుభావుడు అనంతరం శర్వానంద్ ఇంతవరకు బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అందుకోలేదు.. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను సినిమాలు వరుసగా ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాల అనంతరం ఎలాగైనా సక్సెస్ కొట్టాలని శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
శివరాత్రి సందర్భంగా గురువారం గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ తో నడుస్తోంది. అయితే సినిమాకు సంబంధించిన ఓటీటీ, డిజిటల్ బిజినెస్ లో మంచి ప్రాఫిట్స్ అందించినట్లు సమాచారం. ఇక ఓటీటీలో సినిమా తొందరగానే రాబోతున్నట్లు టాక్. ఏప్రిల్ మిడ్ లోనే సినిమా సన్ NXT లోకి రానున్నట్లు సమాచారం. శ్రీకారం బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు 4కోట్లకు పైగా షేర్స్ అందుకున్నట్లు సమాచారం.

వ్యవసాయం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు కిషోర్ తెరకెక్కించాడు. ఇక మూవీ బాక్సాఫీస్ వద్ద 17కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యింది. శనివారం, ఆదివారం కూడా మొదటి రోజు వచ్చిన రేంజ్ కంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తేనే ప్రాఫిట్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. రివ్యూలు కూడా పాజిటివ్ గానే వచ్చాయి. మరి సినిమా ఏ స్థాయిలో లాభాలను అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











