Guntur karam మూవీలో వాళ్లు సిస్టర్సా? ఆ కోల్డ్ వార్‌కు మహేశ్‌కు సంబంధం ఏంటి?
టాలీవుడ్‌లో ఇప్పుడు తెరకెక్కుతోన్న క్రేజీ మూవీల్లో 'గుంటూరు కారం' ఒకటన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి కారణం ఈ సినిమాను సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తుండడమే. దాదాపు పన్నెండేళ్ల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ పక్కా కమర్షియల్ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన షూటింగ్ సజావుగా సాగడం లేదు. దీనికి తోడు ఈ చిత్రం గురించి ఎన్నో రకాల షాకింగ్ న్యూస్‌లు ప్రచారం అవుతూనే ఉన్నాయి. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో ఈ చిత్రం నుంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి.

'గుంటూరు కారం' మూవీలో ముందుగా పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెను తప్పించి ఆ స్థానంలో శ్రీలీలను ఎంపిక చేశారు. ఇప్పటికే ఆమె ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో కూడా పాల్గొంది. ఆ తర్వాత ఈ మూవీలో మరో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని కూడా తీసుకున్నారు. ఈమె కూడా ఇప్పటికే ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.
మహేశ్ బాబు హీరోగా చేస్తున్న 'గుంటూరు కారం' మూవీలో ఇద్దరు హీరోయిన్లు ఎలాంటి పాత్రలు చేస్తున్నారన్న దానిపై ఎన్నో రకాల ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా దీనిపై కీలక సమాచారం లీకైంది. దీని ప్రకారం.. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి సిస్టర్లుగా నటిస్తున్నారట. అయితే, వీళ్లిద్దరికీ తండ్రి ఒక్కడే అయినా తల్లులు వేరే అని తెలిసింది. దీంతో చిన్న వయసు నుంచే వీళ్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందట. మహేశ్ విషయంలోనూ వీళ్లిద్దరూ పోటీ పడతారని, ఆ సీన్స్ అన్నీ మజాను పంచేలా ఉంటాయని తెలుస్తోంది.

ఇక, మహేశ్ - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న 'గుంటూరు కారం' సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందని ప్రకటించారు. కానీ, దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











