యంగ్ క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్?. ఆ ఆటగాడు ఎవరంటే?

టాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే స్టార్‌డమ్ అందుకున్న యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela). ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం, డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు, తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రూమర్స్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ముఖ్యంగా యంగ్ ఇండియన్ క్రికెటర్‌తో ఆమె డేటింగ్‌లో ఉందనే ప్రచారం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరు?

Also Read
Peddi: రియల్ స్టోరీతో పెద్ది.. రామ్ చరణ్ క్యారెక్టర్‌కు అతడే ఇన్‌స్పిరేషన్!
Peddi: రియల్ స్టోరీతో పెద్ది.. రామ్ చరణ్ క్యారెక్టర్‌కు అతడే ఇన్‌స్పిరేషన్!

ఆ టీమిండియా క్రికెటర్ ఎవరో కాదు.. తిలక్ వర్మ. ఇటీవల వర్ధమాన ఆటగాడిగా, ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో ఆడుతున్న తిలక్ వర్మ ఇటీవల తన బ్యాటింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ బెస్ట్ క్రికెటర్ గా రాణిస్తున్నారు. అయితే.. ఈ ఆటగాడితో హీరోయిన్ డేటింగ్ లో ఉన్నట్టు రూమార్స్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ గాసిప్స్‌కు కారణాలుగా కొన్ని సంఘటనలను నెటిజన్లు చూపిస్తున్నారు.

Recommended For You
పెద్దిలో జాన్వీ ఫస్ట్ ఛాయిస్ కాదా.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరు?
పెద్దిలో జాన్వీ ఫస్ట్ ఛాయిస్ కాదా.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరు?
Sreeleela Dating Rumours Is Actress Linked With Cricketer Tilak Varma

గతంలో తిరుమల దర్శనానికి ఇద్దరి కుటుంబాలతో ఒకేసారి రావడం, అలాగే ఐపీఎల్ మ్యాచ్‌లలో శ్రీలీల కుటుంబ సభ్యులు కనిపించడం వంటి కారణాలతో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టేడియంలో తిలక్ వర్మ జెర్సీలు కనిపించడం కూడా ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చింది. అంతేకాదు, "గత ఏడాది నుంచి వీరిద్దరూ సీక్రెట్‌గా డేటింగ్‌లో ఉన్నారు", "త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు" అనే వరకు సోషల్ మీడియాలో ఊహాగానాలు వెళ్లిపోయాయి.

You May Also Like
ఆ 50 నిమిషాలు పిచ్చెక్కిపోతుంది.. పెద్దిపై డైరెక్టర్ బుచ్చిబాబు హైప్
ఆ 50 నిమిషాలు పిచ్చెక్కిపోతుంది.. పెద్దిపై డైరెక్టర్ బుచ్చిబాబు హైప్

ఇప్పటికే క్రికెట్- సినిమా కలయికలో విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, కేఎల్ రాహుల్-అథియా శెట్టి జంటలు ఉన్నాయి... అదే ట్రెండ్‌లో మరో తెలుగు జంట రాబోతుందా? అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. అయితే, ఈ వార్తల్లో ఎంత నిజం ఉందన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ రూమర్లపై అటు శ్రీలీల కానీ, ఇటు తిలక్ వర్మ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అంగీకరించలేదు, ఖండించలేదు కూడా. దీంతో ఈ గాసిప్స్‌పై అనుమానాలు పెరుగుతున్నాయి.

ఏడాది తర్వాత బిగ్ సీక్రెట్ రివీల్.. బిగ్ బాస్ నటుడు సర్ప్రైజ్ ఇచ్చాడుగా!
ఏడాది తర్వాత బిగ్ సీక్రెట్ రివీల్.. బిగ్ బాస్ నటుడు సర్ప్రైజ్ ఇచ్చాడుగా!

ఇక శ్రీలీల సన్నిహితులు మాత్రం ఈ వార్తలను పూర్తిగా కొట్టిపారేస్తున్నాయి. "ఇవి కేవలం పుకార్లే, ప్రస్తుతం ఆమె ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉంది" అని చెబుతున్నాయి. నిజానికి శ్రీలీల ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో ఉంది. వరుస ప్రాజెక్ట్స్, స్టార్ హీరోలతో అవకాశాలు ఆమె కెరీర్‌ను టాప్ గేర్‌లోకి తీసుకెళ్తున్నాయి. ఈ డేటింగ్ రూమర్స్ కు చెక్ పడాలంటే.. శ్రీలీల లేదా తిలక్ వర్మ నుంచి అధికారిక క్లారిటీ ఇవ్వాల్సిందే.

Read more about: tilak varma sreeleela tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X