శ్రీలీలకు షాక్.. ఆ యంగ్ హీరో మూవీ నుంచి ఔట్?

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫుల్ డిమాండ్‌లో ఉన్నది, లీడ్‌లో ఉన్న హీరోయిన్ ఎవరంటే టక్కున వినిపించే పేరు శ్రీలీల. సీనియర్ హీరోలు, యంగ్ హీరోల ఫస్ట్ ఛాయిస్ ఈ ముద్దుగుమ్మే. చేసిన సినిమాలన్నీ ఒకదాని వెంట మరొకటి ఫ్లాప్ అవుతున్నా శ్రీలీల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్‌లో గట్టిగా పాగా వేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌లోనూ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. శ్రీలీల స్పీడు చూసి హిందీ ముద్దుగుమ్మలు సైతం ఆశ్చర్యపోతున్నారు. అలాంటిది ఓ యంగ్ హీరో సినిమా నుంచి శ్రీలీలను తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

Take a Poll

వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా
పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. ధమాకాతో తొలి బ్రేక్ అందుకుంది. ఆ వెంటనే గుంటూరు కారం, భగవంత్ కేసరి, స్కంధ, ఆదికేశవ, ఎక్స్‌ట్రార్డినరీమెన్, పుష్ప 2 ది రూల్, రాబిన్‌హుడ్ చిత్రాలలో అవకాశాలు అందుకుంది శ్రీలీల. నటించిన సినిమాలలో సగానికి పైగా ఫ్లాప్‌లే కానీ ఈమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ సరసన మాస్ జాతర, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్, తమిళంలో పరాశక్తి, కన్నడంలో జూనియర్ సినిమాలు చేస్తున్న శ్రీలీల.. బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. కార్తీక్ ఆర్యన్ సరసన ఆషీకి 3లో నటిస్తున్నారు.

Sreeleela Exits from Akhil Akkineni s Lenin Reports

కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల డేటింగ్?
హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిందో లేదో ఈ ముద్దుగుమ్మకి అక్కడి నీళ్లు బాగా పడినట్లుగా ఉన్నాయి. బాలీవుడ్ కల్చర్‌లో ఎక్కువగా వినిపించే డేటింగ్ రూమర్స్ శ్రీలీల విషయంలోనూ వినిపిస్తున్నాయి. కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల డేటింగ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మొన్నామధ్య ముంబైలో జరిగిన ఓ మూవీ సమ్మిట్‌లో కార్తీక్ ఆర్యన్ తల్లితో కనిపించడం.. అలాగే ఆమె కూడా తనకు కాబోయే కోడలు డాక్టర్ అయితే బాగుండు అని బహిరంగంగా వ్యాఖ్యానించడం శ్రీలీలతో కార్తీక్ ఆర్యన్ రిలేషన్‌పై వార్తలకు బలం చేకూరస్తున్నాయి.

అఖిల్ సరసన శ్రీలీల
ఇదిలాఉండగా.. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ లాంగ్ గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం అఖిల్. ఇది ఆయన కెరీర్‌లో 6వ చిత్రం. వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్‌‌గా నటిస్తున్నారు. ఇటీవల అఖిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా లెనిన్‌ను తెరకెక్కిస్తున్నారు. దీపావళి కానుకగా లెనిన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.

నిర్మాతలను విసిగిస్తోన్న శ్రీలీల తల్లి?
అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలను తప్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి. చేతినిండా సినిమాలతో ఆమె డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో లెనిన్ యూనిట్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. శ్రీలీల కారణంగా ఇప్పటికే పలుమార్లు షూటింగ్‌లు వాయిదా వేయాల్సి వచ్చిందట. ఆమె తీరుతో విసిగిపోయిన లెనిన్ మేకర్స్.. శ్రీలీలను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్లుగా కథనాలు వినిపిస్తున్నాయి. ఆమెకు బదులుగా మరో బ్యూటీని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మరో వెర్షన్ ప్రకారం.. శ్రీలీల తల్లికి లెనిన్ నుంచి ఆమెను తప్పించడానికి కారణంగా తెలుస్తోంది. కూతురితో బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టించడం.. తెలుగు సినిమాలకు డేట్స్ తగ్గించడం వంటి నిర్ణయాలతో శ్రీలీల తల్లి విసుగు తెప్పించారని అందుకే లెనిన్ నిర్మాతలు ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్లుగా ఆ కథనాల సారాంశం. నిజంగానే శ్రీలీలను లెనిన్ మూవీ నుంచి తప్పించారా? లేక ఇవన్నీ గాలివార్తలేనా? అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: sreeleela akhil akkineni lenin
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X