శ్రీలీలా ఫస్ట్ హిందీ మూవీ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లో తెలుసా?
టాలీవుడ్ యంగ్ అండ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలా చిన్న వయస్సులోనే స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిందే మొదలు ఈ ముద్దుగుమ్మకు వరుస పెట్టి ఆఫర్లు దక్కాయి. ఈ క్రమంలోనే చిన్న హీరోలతోనే కాకుండా ఏకంగా టాప్ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీకి సిద్దమైంది. అయితే బాలీవుడ్ లో శ్రీలీలా తొలి చిత్రంలో నటించేందుకు తీసుకున్న పారితోషికం ఎంతనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ లో శ్రీలీలా తొలి చిత్రం..
శ్రీలీలా బాలీవుడ్ లో చేస్తున్న తొలిచిత్రం ఆషికీ 3. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. జోడీగా శ్రీలీలా నటిస్తోంది. అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఈ ఏడాది దీపావళికి విడుదల చేయాలని మేకర్స్ ఏర్పాట్లు చేశారు. కానీ మళ్లీ 2026 ప్రేమికుల దినోత్సవాన్ని రిలీజ్ డేట్ ను ఫిఫ్ట్ చేశారు. ఇంకా పక్కా విడుదల తేదీని ఖరారు చేయలేదు. టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రీతమ్ చక్రవర్తి సంగీతం అందిస్తున్నారు. ఇక శ్రీలీలాకు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సగానికి పైగా తగ్గిన రెమ్యునరేషన్..
తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీలీలా ఇప్పటికీ దుమ్ములేపుతోంది. మహేశ్ బాబు, రామ్ పోతినేని, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో ప్రస్తుతం భారీ డిమాండ్ పెరిగింది. అయితే శ్రీలీలాకు ఇటీవల వరుసగా ఫ్లాప్స్ పడుతుండటం బాధాకరం. దీంతో ఆమె రెమ్యునరేషన్ పై ప్రభావం పడుతుంది. హిందీలో తన తొలి చిత్రానికి శ్రీలీలా రూ.7 కోట్ల వరకు డిమాండ్ చేసిందంట. కానీ వారు శ్రీలీలాకు కేవలం రూ.3.5 కోట్లు ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. కనీసం బాలీవుడ్ తొలిచిత్రంతోనైనా శ్రీలీలాకు భారీ సక్సెస్ అందాలని అభిమానులు కోరుకుంటున్నారు.
శ్రీలీలా హిందీ మూవీస్..
శ్రీలీలాకు ప్రస్తుతం హిందీలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తుండగా.. మరో రెండు చిత్రాలు లైనప్ లో ఉన్నాయని తెలుస్తోంది. స్టార్ హీరో వరుణ్ ధావన్ కు జోడీగా నటించే అవకాశం దక్కించుకుందని టాక్. మరోవైపు యంగ్ స్టార్ ఇబ్రహీం ఖాన్ తో మరో ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది.
శ్రీలీలా రాబోయే చిత్రాలు..
ఇక తెలుగులో ప్రస్తుతం శ్రీలీలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని హరీశ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మాస్ మహారాజా రవితేజతో రెండో సారి కలిసి నటిస్తోంది. RT75గా ఆ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అలాగే అఖిల్ అక్కినేని సరసన లెనిన్ చిత్రంలోనూ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











