బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ర‌ష్మిక‌ హవాకు బ్రేక్ పడినట్లేనా..?

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల.. అతి తక్కువ కాలంలో పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో ఈ అమ్మడు ఒక్కరు. ఇటీవల అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప 2' సినిమా లోని 'కిస్సిక్' సాంగ్ పై మాస్ స్టెప్పులు వేసి.. నేషనల్ వైడ్ గా ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఈ స్పెషల్ సాంగ్ తో ఈ అమ్మడు కెరీర్ మొత్తం టర్న్ అయిపోయిందనడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా ఈ అమ్మడు ఓ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు, స్టార్ హీరో కొడుకుతో మూవీ సెట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హవాకు శ్రీలీల బ్రేకులు వేయబోతున్నదా? అనే ప్రచారం జరుగుతోంది. అసలే జరిగిందంటే?

కన్నడ ఇండస్ట్రీ నుండి టాలీవుడ్ లో అడుగుపెట్టింది శ్రీ లీల. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన 'పెళ్లి సందD' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తన మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. దీంతో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజతో 'ధమాకా' సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఈ సినిమాలో గాజువాక కండక్టర్ సాంగ్ లో శ్రీలీల వేసిన మాస్ స్టెప్పులు ఎన్నటికీ తెలుగు ప్రేక్షకులు మరిచిపోరు.ఈ సినిమాతో శ్రీలీల మరింత క్రేజ్ సొంతం చేసుకుంది.

Sreeleela Gets Bollywood Offer With Karthik Aryan is sreeleela check to Rashmika

అనంతరం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'భగవంత్ కేసరి' సినిమాలో ప్రధాన పాత్రలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమాలో నటించి స్పెషల్ స్టార్ డమ్ సొంతం చేసుకోండి. ఇలా వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోలతో పోటీ పడి నటిస్తూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇలా అతి తక్కువ కాలంలో మహేష్ బాబు, బాలకృష్ణ, రవి తేజ, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకోండి.

ఇక పుష్ప 2 సినిమాలో కిస్సిక్ పాటపై వేసిన గ్లామర్ స్టెప్పులు వేరే లెవల్.. ఈ సినిమాతో ఈ అమ్మడుకు నేషనల్ లెవల్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. దీంతో వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', హీరో నితిన్ 'రాబిన్‌హుడ్', మాస్ రాజా రవితేజ 'మాస్ జాతర' చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలతో ఈ బ్యూటీ బాక్సాఫీస్ దగ్గర వరుస విజయాలను అందుకోవడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

Sreeleela Gets Bollywood Offer With Karthik Aryan is sreeleela check to Rashmika

ఇదిలాఉంటే.. శ్రీలీలకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో గుప్పు మంటుంది. ఇప్పటివరకు టాలీవుడ్ లో దుమ్మురేపిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో సందడి చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తో శ్రీ లీల ఓ సినిమా చేయనుంది. ఈ సినిమా స్టోరీ నచ్చడంతో శ్రీ లీల కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమా షూట్ త్వరలోనే ప్రారంభం కానున్నదంట. ఇదెలా ఉంటే.. తాజాగా శ్రీలీల కు మరో బాలీవుడ్ ఆఫర్ వచ్చిందట. ఈ సినిమా కథ కూడా నచ్చడంతో దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ నెక్స్ట్ మూవీలో హీరోయిన్‌గా శ్రీలీల నటించబోతుందని బీ-టౌన్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలా తన మొదటి సినిమా మొదలు కాకుండానే, రెండో సినిమాకు ఓకే చెప్పడంతో శ్రీలీల టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. నేషనల్ క్రష్ రష్మిక యానిమల్, పుష్ప 2 లాంటి సినిమాలు తో ఒక్కసారిగా బాలీవుడ్ లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా శ్రీలీల కూడా అలా ఎంట్రీ ఇవ్వడం, ఈ అమ్మడు చేతిలో భారీ బడ్జెట్ సినిమాలు ఉండటం, ఈ అమ్మడు చేస్తున్న ఈ రెండు సినిమాలు హిట్ అయితే కచ్చితంగా రష్మిక దూకుడుకు చెక్‌ పడినట్లేనని అభిమానులు భావిస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి మరీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X