ఆ స్టార్ హీరోతో సైలెంట్‌గా శ్రీలీల నిశ్చితార్ధం?.. బిగ్ డే అంటూ ఫోటోలతో షాక్!
ప్రస్తుతం సినీతారల పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. నటీనటులు ఒక్కోక్కరిగా పెళ్లి పీటలెక్కేస్తున్నారు. కొందరి విషయంలో పుకార్లే నిజమవుతూ సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుంటున్నారు. ఈ పరిణామాలతో ఆశ్చర్యపోవడం అభిమానుల వంతు అవుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల వ్యక్తిగత జీవితంపైనా బోలెడన్నీ గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. పలువురు స్టార్ హీరోలతో ఆమె రిలేషన్‌లో ఉందంటూ గత కొద్దినెలలుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి. ఈ వివరాల్లోకి వెళితే..
షార్ట్ గ్యాప్‌లో స్టార్ హీరోయిన్‌గా
బాలనటిగా తొలుత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మూడు నాలుగేళ్లు తిరిగేసరికి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు శ్రీలీల. తొలుత కన్నడ సీమలో తన అదృష్టం పరీక్షించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పెళ్లిసందDతో తెలుగు వారిని పలకరించారు. మాస్ మహారాజా రవితేజతో జంటగా నటించిన ధమాకాతో శ్రీలీల టాలెంట్ ఏంటో అందరికీ తెలిసొచ్చింది. నాటి నుంచి టాలీవుడ్‌లో శ్రీలీల శకం మొదలైంది. స్కంధ, ఆదికేశవ, ఎక్స్‌ట్రార్డినరీ మేన్, గుంటూరు కారం, భగవంత్ కేసరిలతో వరుస అవకాశాలు అందుకున్న శ్రీలీలకు పుష్ప 2లోని కిస్సిక్ సాంగ్ నేషనల్ వైడ్ పాపులారిటీని తెచ్చిపెట్టింది.

ఆషికి 3తో బాలీవుడ్ ఎంట్రీ
ఫ్లాపులొస్తున్నా సరే శ్రీలీల రేంజ్ మాత్రం తగ్గడం లేదు. ఏకంగా బాలీవుడ్‌లో పాగా వేసే స్థాయికి ఆమె ఎదిగింది. అనురాగ్ బసు తెరకెక్కిస్తోన్న ఆషికి 3 ద్వారా హిందీలో అడుగు పెడుతోంది శ్రీలీల. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ సరసన ఆమె నటిస్తున్నారు. టీ సిరీస్ అధినేత భరత్ భూషణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అషికి 3 ఇంకా సెట్స్ మీద ఉండగానే శ్రీలీల హిందీలో మరో ఆఫర్ అందుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సిద్ధార్ధ్ మల్హోత్రా సరసన శ్రీలీల ఆడిపడనుందట. ఆనంద్ ఎల్ రాయ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. రాజ్ సాండియాలా దర్శకత్వం వహిస్తారని బీటౌన్ మీడియా చెబుతోంది. ఇవి కాకుండా తెలుగులో జూనియర్, మాస్ జాతర, లెనిన్, తమిళంలో పరాశక్తి సినిమాలలో శ్రీలీల నటిస్తున్నారు.
కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల డేటింగ్?
గతంలో బెంగళూరు, హైదరాబాద్‌లకే పరిమితమైన శ్రీలీల ఇప్పుడు ఎక్కువ సమయం ముంబైలోనే గడుపుతోంది. బాలీవుడ్‌లో నటిస్తోంది కాబట్టి అదే సహజమే అనుకున్నా.. అంతకుమించి ఏదో జరుగుతోందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. శ్రీలీల ప్రేమలో పడటమే అందుకు కారణం అంటోంది బీటౌన్ మీడియా. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌తో కనిపించి అప్పట్లో శ్రీలీల వార్తల్లో నిలిచింది. ఆ వెంటనే కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల డేటింగ్ చేస్తున్నట్లుగా రూమర్స్ వినిపించాయి. కొద్దిరోజుల క్రితం వేవ్స్ 2025 సదస్సులో కార్తీక్ ఆర్యన్ తల్లితో ఈ చిన్నది కనిపించడం ఈ వార్తలకు బలం చేకూర్చినట్లయ్యింది. దీనికి కొద్దిరోజుల ముందు కూడా తనకు కాబోయే కోడలు డాక్టర్ అయితే బాగుంటుందని కార్తీక్ ఆర్యన్ తల్లి చెప్పడం ఎన్నో అనుమానాలు కలిగించింది.
ఫోటోలతో షాకిచ్చిన శ్రీలీల
తాజాగా శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కొందరు పెద్దలు, ముత్తయిదువలు ఆమెకు పసుసు రాసి, హారతి ఇస్తూ, ఆశీర్వదించారు. ఈ ఫోటోలకు బిగ్ డే.. కమింగ్ సూన్ అనే క్యాప్షన్ పెట్టడంతో శ్రీలీల సీక్రెట్‌గా నిశ్చితార్ధం చేసేసుకున్నారంటూ గాసిప్స్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరేమో శ్రీలీల ఏదైనా సినిమా కోసమో లేదంటే వాణిజ్య ప్రకటన కోసమో రెడీ అవుతున్నారని కామెంట్స్ పెట్టారు. కట్ చేస్తే వచ్చే నెల 14న శ్రీలీల పుట్టినరోజు.. ఈ కార్యక్రమాన్ని తిథుల పరంగా కాస్త ముందుగానే ఆమె కుటుంబ సభ్యులు నిర్వహించినట్లుగా టాక్. మరి ఆ ఫోటోల వెనుక అసలు రీజన్ ఏంటో తెలియాలంటే శ్రీలీల క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











