Don't Miss!
- News
Vastu tips: ఇంటికెళితే చిరాకులా.. అన్నీ సమస్యలా.. బయటపడేందుకు చెయ్యాల్సిందిదే!!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
SSMB28: మహేశ్ మూవీ నుంచి యంగ్ బ్యూటీ ఔట్.. టాలీవుడ్‌లో కలకలం
టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో ప్రేక్షకులను అలరిస్తూ బడా హీరోగా హవాను చూపిస్తోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే గత ఏడాదిలో 'సర్కారు వారి పాట' అనే కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆశించిన రీతిలో కలెక్షన్లు రాకపోయినా ఈ మూవీ ఫలితంపై మహేశ్ బాబు సంతృప్తిగా ఉన్నాడు. దీంతో వెంటనే మరో సినిమాను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
బిగ్ బాస్ శ్రీ సత్య బాత్రూం ఫొటోలు వైరల్: అబ్బో ఆమెనిలా చూశారంటే!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కమర్షియల్ జోనర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసుకున్నారు. ఈ పార్ట్ మొత్తం ఎంతో మంచిగా వచ్చినట్లు తెలిసింది. ఇక, దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను జనవరి 17 నుంచి మొదలెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. ఈమెతో పాటు మరో బ్యూటీ, పెళ్లి సందD ఫేం శ్రీలీలా కూడా నటిస్తున్నట్లు చాలా రోజుల క్రితమే ఓ న్యూస్ లీకైంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఇప్పుడీ యంగ్ హీరోయిన్ ఈ మూవీ నుంచి తప్పుకుందట. గతంలో తాను చేసుకున్న ఒప్పందాల కారణంగా డేట్స్ అడ్జస్ట్ చేయలేకే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీలీల ఇంత పెద్ద ఆఫర్ రిజెక్ట్ చేసిందన్న వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది.
జబర్ధస్త్ రీతూ ఓవర్ డోస్ హాట్ షో: డ్రెస్ సైజ్ తగ్గించి మరీ టెంప్ట్ చేస్తూ!

క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, దీనికి 'అర్జునుడు', 'అతడే పార్థు' వంటి టైటిళ్లు పరిశీలిస్తున్నారు. ఇక, ఈ మూవీలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు.