పెళ్లి సందడి బ్యూటీకి మరో గోల్డెన్ ఛాన్స్.. ఏకంగా పాన్ ఇండియా స్టార్ తో రొమాన్స్?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత కొంత కాలంగా కొంతమంది చిన్న హీరోయిన్స్ ఊహించని విధంగా చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. కాస్త అందంగా ఉండి బాక్సాఫీస్ వద్ద ఒక మంచి హిట్ అందుకున్నా చాలు వారి దశ తిరిగిపోతుంది. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో శ్రీ లీల పేరు కూడా హాట్ టాపిక్ గా నిలుస్తోంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమా తో ఈ బ్యూటీ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. మొత్తానికి పెళ్లి సందD సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను అందించింది. దీంతో శ్రీలీలకు కూడా మంచి గుర్తింపు లభించింది. ఆ ఒక్క సినిమాతోనే రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచిదట.
ఇక ఈ బ్యూటీకి ప్రస్తుతం కేవలం తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా తమిళం కన్నడ ఇండస్ట్రీ లో కూడా చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ శ్రీ లీల తొందర పడకుండా కేవలం తనకు నచ్చిన మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటోంది. ఇక ఈ బ్యూటీకి ఇటీవల మరొక గోల్డెన్ ఛాన్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే రవితేజ నటిస్తున్న ధమాకా సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. ధమాకా సినిమాకు శ్రీలీలకు భారీ స్థాయిలో పారితోషికం కూడా ఇస్తున్నట్లు సమాచారం.

ఇక త్వరలోనే శ్రీలీల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కూడా రొమాన్స్ చేసే అవకాశం ఉన్నట్లు అయితే టాక్ గట్టిగానే వస్తుంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్న ప్రభాస్ లేటెస్ట్ గ్లామర్ హీరోయిన్స్ తో కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ తో నటించబోయే ఛాన్స్ కూడా శ్రీలీలకు దక్కే ఛాన్స్ ఉందట. మారుతి దర్శకత్వంలో చేయబోయే కామెడీ హారర్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు మారుతి ఆ సినిమా కోసం కథలో భాగంగా మొత్తం ముగ్గురు హీరోయిన్స్ ను ఫైనల్ చేయడానికి చూస్తున్నాడు.
అయితే మారుతికి సన్నిహితంగా ఉండే కొంతమంది హీరోయిన్స్ కూడా ప్రభాస్ సినిమాలో అవకాశం ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. అందులో మెహ్రీన్ ఫిర్జాదా కూడా ఉన్నట్లుగా టాక్ వస్తుంది. ఇక శ్రీలీలను కూడా మరొక హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకోవాలి అని దర్శకుడు మారుతీ ఆలోచనలో పడినట్లు సమాచారం. ఈ సినిమాను యు.వి.క్రియేషన్స్ నిర్మించనుంది. ఇక సినిమా షూటింగ్ రెండు మూడు నెలల్లోనే ఫినిష్ చేసే విధంగా దర్శకుడు మారుతి ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఆ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఇదే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారని సమాచారం.


Click it and Unblock the Notifications











