VD12: విజయ్ దేవరకొండ మూవీ నుంచి శ్రీలీల ఔట్.. ఏ హీరోయిన్‌కు ఛాన్స్ వచ్చిందంటే?
రౌడీబాయ్ విజయ్ దేవరకొండ.. ఈ పేరు వింటే చాలు చాలా మంది అమ్మాయిలు ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంటారు. ముఖ్యంగా తెలుగు అమ్మాయిల క్రేజీ హీరోగా, రౌడీ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇతగాడికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో పెద్ద ఎత్తున క్రేజ్ సంపాధించుకున్న ఆయన.. వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకెళ్తున్నారు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ లో నటిస్తున్న ఈయన ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. అయితే ఈ సినిమా గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రౌడీ బాయ్ ఓ సినిమా చేయబోతుండగా... సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విజయ్ దేవర కొండకు 12వ చిత్రం కావడంతో దీని వీడీ12 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్యూట్ బ్యూటీ శ్రీలీలను తీసుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది.

అయితే అందుకు ప్రధాన కారణం.. ఫ్యామిలీ స్టార్ సినిమా అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. గీతాగోవిందం సినిమా డైరెక్టర్ పరుశురాంతోనే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ దీనికి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా కాగానే VD12 చేయాలని భావించారు. కానీ ఈ సినిమా ఆలస్యం కావడంతో అంతా తారుమారు అయింది. ఈ సినిమా పూర్తి అయ్యాకే VD12 చేద్దామని రౌడీ బాయ్ చెప్పడంతో డైరెక్టర్ గౌతమ్ తన్ననూరి కూడా ఓకే చెప్పారట.
అయితే ముందుగా అనుకున్న ప్రకారం షూటింగ్ ఈ పాటికే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ హీరో వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అవడంతో.. శ్రీలీల తన డేట్లను అడ్ జస్ట్ చేసుకోలేక పోతుందట. అందుకు ఈ సినిమా నుంచి తప్పుకుంటానని కూడా మూవీ టీంకు చెప్పిందట. దీంతో వాళ్లు కూడా ఓకే అని చెప్పగా... రెండో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలు అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన యానిమల్ సినిమా నటిని తీసుకు వస్తే బాగుంటుందని చిత్ర బృందం భావిస్తుందట.

యానిమల్ సినిమాలో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ త్రిప్తి దిమ్రిని VD12లో తీసుకు వస్తే బాగుంటుందని.. ఆమెనే తీసోకువాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఆమె కూడా ఓకే చెబితే రౌడ్ బాయ్ సరసన ఈ ముద్దుగుమ్మను మనం చూడవచ్చు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నమోదు కాగా.. ఎప్పుడెప్పుడు సినిమా షూటంగ్ ప్రారంభం అవుతుందా అని కూడా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











