చిరంజీవికి బాలయ్య కూతురు బిగ్ షాక్.. అందుకే ఈ నిర్ణయం తీసుకుందా!
ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం వెనకడుగు వేయకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోలు టాలీవుడ్‌లో చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత వేగంగా సినిమాలు చేస్తోన్న ఆయన.. ఈ మధ్య కాలంలోనే పలు రకాల జోనర్లలో సినిమాలు చేసి ప్రేక్షకులను ఓ రేంజ్‌లో అలరించారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' అనే సినిమాను చేస్తున్నారు. 'బింబిసార'తో సత్తా చాటిన మల్లిడి వశిష్ట దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ పంచభూతాలు, ముల్లోకాలు అనే కాన్సెప్టుతో సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతుంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'విశ్వంభర' సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈ ఏడాది మొదట్లోనే ప్రారంభం అయింది. అప్పటి నుంచి వరుసగా షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటూ షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ఇలా ఇప్పటి వరకూ 50 శాతానికి పైగానే టాకీ పార్టును కంప్లీట్ చేశారు. మిగిలిన దాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేయనున్నారు.
హై రేంజ్ గ్రాఫిక్స్‌తో రూపొందుతోన్న 'విశ్వంభర' మూవీలో హీరోయిన్‌గా త్రిషను తీసుకున్నారు. ఆమెతో పాటు ఎంతో మంది ప్రముఖులు ఇందులో కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రం కోసం టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలను దర్శకుడు వశిష్ట సంప్రదించినట్లు తెలిసింది. దీనిపై తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'విశ్వంభర' సినిమా కోసం శ్రీలీలతో దర్శకుడు చర్చలు జరుపగా ఆమె దీనికి నో చెప్పినట్లు తెలిసింది. అయితే, ఆమె ఎందుకు ఈ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది? అసలు ఆమెకు రోల్ ఆఫర్ చేశారా? లేక స్పెషల్ సాంగ్ కోసం అడిగారా? అన్న విషయాలు తెలియలేదు. మొత్తానికి చిరంజీవికి శ్రీలీల నో చెప్పడం హాట్ టాపిక్ అయిపోతోంది. ఇదిలా ఉండగా.. శ్రీలీల 'భగవంత్ కేసరి' మూవీలో బాలయ్యకు పెంపుడు కూతురిగా నటించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - వశిష్ట కాంబోలో రాబోతున్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, నవీన్ చంద్రలు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 10 తేదీన విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











