Pushpa 2 : పుష్ప 2లో ఐటెం సాంగ్ .. శ్రీలీల రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?
సరిగ్గా మూడేళ్ల క్రితం ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప ది రైజ్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 1980వ దశకంలో శేషాచలం కొండల్లో జరిగిన ఎర్రచందనం స్మగ్లింగ్ , ఆ ముఠాల మధ్య జరిగిన ఆధిపత్య పోరు ఇతివృత్తంతో పుష్ప తెరకెక్కింది. పాటలు, మాటలు, డైలాగ్స్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లో స్థానం దక్కించుకుంది. ఈ క్రమంలో పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
పుష్ప 2 సెట్స్‌పైకి వెళ్లినప్పుడే ఈ ఏడాది ఆగస్ట్ 15న రిలీజ్ డేట్‌ని లాక్ చేసేసింది. కానీ అనూహ్యంగా డిసెంబర్ 6కి సినిమాను వాయిదా వేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ నిర్ణయం తీసుకోవడంతో బన్నీ ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఈ సినిమాను ఒక రోజు ముందుకు జరిపి అంటే డిసెంబర్ 5వ తేదీన విడుదల చేస్తామని చెప్పడంతో ప్రేక్షకులు ఖుషీ అవుతున్నారు. ఇంతటి భారీ హైప్ ఉన్న నేపథ్యంలో పుష్ప 2కు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ఫిలింనగర్ టాక్.

థియేట్రికల్ రైట్స్ కింద ఏకంగా రూ. 640 కోట్లు, డిజిటల్ రైట్స్ రూ. 275 కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూ.65 కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ.85 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ. 1065 కోట్ల వ్యాపారంతో పుష్పరాజ్ రికార్డుల దుమ్ముదులిపాడు. అలాగే పుష్ప 2ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11500 థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇక సుకుమార్ చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌కు ప్రత్యేక స్థానముంది. ఆయన ప్రతి చిత్రంలోనూ స్పెషల్ సాంగ్ ఉండి తీరాల్సిందే.
ఆర్య నుంచి పుష్ప ది రైజ్ వరకు సుకుమార్ తీసిన అన్ని చిత్రాల్లోనూ ఐటెం సాంగ్స్ ఉన్నాయి. ఇక పుష్ప పార్ట్ 1లోని ఊ అంటావా మావా సాంగ్ మాస్‌కి పూనకాలు తెచ్చిపెట్టింది. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ పాటలో అల్లు అర్జున్‌తో కలిసి స్టెప్స్ వేయగా.. ఇంద్రావతి చౌహాన్ ఆలపించారు. జాతరలు, తిరునాళ్లు, స్పెషల్ ఈవెంట్స్‌లో ఊ అంటావా మావా సాంగ్ ఇప్పటికీ మోతక్కాల్సిందే.

తాజాగా పుష్ప 2లో స్పెషల్ సాంగ్ ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరిగింది. దీనిని ఎవరు వేస్తారు, మళ్లీ సమంతనే రప్పిస్తారా అంటూ డిస్కషన్ నడిచింది. మధ్యలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ పేరు కూడా వినిపించింది. కానీ అనూహ్యంగా శ్రీలీల పేరు తెరపైకి రావడంతో ఇండస్ట్రీ వర్గాలు షాకయ్యాయి. అయితే డ్యాన్సింగ్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న శ్రీలీల.. ఐకాన్ స్టార్ పక్కన ఎలా డ్యాన్స్ చేశారోనని ఫ్యాన్స్ ఎగ్జయిటింగ్‌తో ఎదురుచూస్తున్నారు. కిస్సిక్ సాంగ్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తి చేయగా.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంతాబాగానే ఉంది కానీ ఈ ఐటెం సాంగ్ కోసం శ్రీలీల ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. అయితే సోషల్ మీడియా కథనాలను బట్టి కిస్సిక్ సాంగ్ చేసినందుకు ఆమె ఏకంగా రూ. కోటిని పారితోషికంగా తీసుకున్నారట. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











