Sreeleela: సమంతను పక్కకు నెట్టేసిన శ్రీలీల.. ఆ హాలీవుడ్ మూవీలో ఛాన్స్.. స్టోరీ ఏంటంటే?
అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది ముద్దుగుమ్మ శ్రీలీల. శ్రీకాంత్ కుమారుడు రోషన్ నటించిన చేసిన పెళ్లి సందD సినిమాతో మోస్ట్ పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ తర్వాత ధమాకా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. దీంతో శ్రీలీల వెంట వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే 7 భారీ చిత్రాలు చేస్తున్న ఈ క్యూట్ బ్యూటి సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత స్థానాన్ని లాక్కుందని తాజాగా వార్తలు వస్తున్నాయి. సామ్ చేయాల్సిన హాలీవుడ్ మూవీలో శ్రీలీల నటించనుందట. ఆ వివరాల్లోకి వెళితే..
బాగా పాపులర్:టాలీవుడ్‌లో అతివేగంగా స్టార్ హీరోయిన్‌గా మారింది గ్లామరస్ క్యూట్ బ్యూటి శ్రీలీల. ప్రస్తుతం శ్రీలీల అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులు బాగా పాపులర్ అయిన ఈ భామ మొదటి సినిమా మాత్రం లవ్ యు ఇడియట్. అయితే ఈ సినిమా పలు కారణాలతో విడుదలకు నోచుకోలేదు.

డబ్ చేసి వదిలి:శ్రీలీల నటించిన మొదటి సినిమా రిలీజ్ కాకపోవడంతో ఆమె చేసిన మూడో మూవీ పెళ్లి సందDనే అంతా మొదటి చిత్రం అనుకున్నారు. అయితే శ్రీలీలకు తెలుగులో మాత్రం పెళ్లి సందD తొలి మూవీ. ఎందుకంటే కన్నడ మూవీ అయిన కిస్ ను తెలుగులోకి లవ్ యు ఇడియట్ గా డబ్ చేసి వదిలారు. ఇటీవలే ఓటీటీలో రిలీజైన ఈ మూవీకి నెగెటివ్ టాక్ వచ్చింది.

కన్నడ-తెలుగు:2019లో వచ్చిన కిస్ (లవ్ యు ఇడియట్) సినిమా తర్వాత శ్రీలీల 2021 సంవత్సరంలో భరతే అనే మరో కన్నడ మూవీ చేసింది. ఆ తర్వాతే తెలుగులో అదే సంవత్సరం పెళ్లి సందD చిత్రంతో తెరంగేట్రం చేసింది. అనంతరం 2022లో మళ్లీ కన్నడలో బై టూ లవ్, జేమ్స్ చిత్రాలతో అలరించింది ఈ క్యూట్ సుందరి శ్రీలీల.

అగ్ర హీరోలతో:2022లోనే తెలుగులో రవితేజతో నటించిన ధమాకా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది స్టన్నింగ్ సుందరి శ్రీలీల. ఇందులో ఆమె నటనకు, డ్యాన్స్ స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు అగ్ర హీరోల సరనస నటించే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. అనగనగ ఒక రాజు అనే ఓ మూవీ చేస్తుంది ఈ బ్యూటి.

హాలీవుడ్ మూవీ:అలాగే శ్రీలీల ప్రస్తుతం రామ్ పోతినేని, నితిన్, విజయ్ దేవరకొండ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాంటి హీరోలతో నటిస్తోంది. మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న SSMB28లో కూడా అవకాశం కొట్టేసింది. మొత్తంగా శ్రీలీల చేతిలో 7 భారీ చిత్రాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే 21 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ ఓ హాలీవుడ్ మూవీలో నటించనుందని టాక్ తెగ చక్కర్లు కొడుతోంది.

హాలీవుడ్ హీరోతో:'చెన్నై స్టోరీ' అనే ఇంగ్లీష్ చిత్రంలో శ్రీలీల నటించనుందట. అయితే ఈ మూవీలో స్టార్ హీరోయిన్ సమంత నటించనుందని మొదటగా టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు సామ్ ను పక్కకు నెట్టేసి ఆ ఛాన్స్ శ్రీలీల కొట్టేసిందని లేటెస్ట్ బజ్. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియదు. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్ వివేక్ కల్రా హీరోగా చేస్తున్నాడు. ఇంగ్లాండ్ కు చెందిన యువకుడికి.. చెన్నై యువతికి మధ్య జరిగే లవ్ స్టోరీగా మూవీ రానుందట.


Click it and Unblock the Notifications











